Begin typing your search above and press return to search.
2018 పోలింగ్ ను క్రాస్ చేసిన మునుగోడు.. సరికొత్త రికార్డు
By: Tupaki Desk | 4 Nov 2022 5:34 AM GMTదేశ వ్యాప్తంగా అందరూ చర్చించుకునేలా చేసిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ క్రతువు ఎట్టకేలకు ముగిసింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉన్నా.. పోలింగ్ ముగిసే నాటికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లో ఉన్న వారందరి చేత ఓట్లు వేయించేసరికి రాత్రి 10.30 గంటల సమయం పట్టినట్లుగా చెబుతున్నారు.
మొత్తం 93.13 శాతం పోలింగ్ నమోదైనట్లుగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ఈ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా రాజకీయ పార్టీల నుంచి మొత్తం 98ఫిర్యాదులు అందినట్లుగా వెల్లడించారు.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. 2018లో జరిగిన ఎన్నికల్లో మునుగోడులో 91.31 శాతం పోలింగ్ జరగ్గా.. తాజా ఉప ఎన్నికల్లో ఆ అంకెల్ని దాటి 93.13 శాతం నమోదు కావటంతో.. తుది ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉప పోరులో విజయాన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. నవంబరు 6న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. అప్పటివరకు తుది పలితం సస్పెన్స్ కొనసాగనుంది.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.30 శాతం పోలింగ్ జరిగితే.. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు జరిగిన పోలింగ్ 38 శాతం నమోదు కావటం గమనార్హం. మొత్తం ఓట్లు 2,41,805. పోలైన ఓట్లు 2,25,192 (ఇందులో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కలుపలేదు) . తొలుత పోలింగ్ 92 శాతం జరిగిందని పేర్కొన్నారు. తర్వాత లెక్కలు మొత్తం సరి చూసుకున్న తర్వాత.. తాము ప్రకటించిన 92 శాతానికి బదులుగా 93.13 శాతం నమోదైనట్లుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఉప ఎన్నిక బరిలో ఉన్న మొత్తం 47 మంది అభ్యర్థుల్లో కేవలం 15 మంది అభ్యర్థులు మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మిగిలిన వారికి మునుగోడు నియోజకవర్గంలో ఓటుహక్కు లేని కారణంగా ఓటు వేయలేని పరిస్థితి. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల అధికార టీఆర్ఎస్.. విపక్ష బీజేపీల మధ్య పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉండటంతో వారందరికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. దీంతో.. పోలింగ్ ప్రక్రియ రాత్రి పదిన్నర వరకు సాగింది.
నియోజకవర్గం మొత్తం అలాంటి పరిస్థితి లేకున్నా.. కొన్ని ప్రాంతాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. భారీగా నమోదైన పోలింగ్ లో ఎవరు విజేత అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోలింగ్ గడువు ముగిసిన వెంటనే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. అందరూ టీఆర్ఎస్ అభ్యర్థే ఈ ఉప పోరులో విజేతగా నిలుస్తారని అంచనా వేశారు. మరి.. వారి అంచనాలు ఏ మేరకు నిజం అవుతాయన్నది తేలాలంటే నవంబరు ఆరో తేదీ వరకు వెయిట్ చేయక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.