Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యేలకు కోట్లు... ఫామ్‌హౌజ్ ఎపిసోడ్‌లో ట్విస్టులే ట్విస్టులు!
By: Tupaki Desk | 27 Oct 2022 5:30 PM GMTరాజకీయాల్లో ఏదైనా.. జరగొచ్చు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా..రావొచ్చు. కానీ.. ఏం జరిగినా.. ఎప్పుడు జరిగినా.. ఇటు నాయకులు.. అటు ప్రజలు కూడా.. నమ్మేలా ఉండాలి. కానీ.. చిత్రం ఏంటంటే.. కొన్ని కొన్ని సంగతులు.. వాస్తవాలకు దూరంగా ఉన్నట్టుగా అనిపించడం.. ఇప్పుడు తాజాగా తెలంగాణలో వెలుగు చూసిన.. ఫామ్‌హౌజ్ వ్యవహారం స్పష్టం చేస్తోంది. దీంతో దీనిని నమ్మశక్యంగా లేదనేది.. పరిశీలకుల మాట.
అసలు ఏం జరిగింది? అంటే.. టీఆర్ ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను.. బీజేపీ పెద్దలు కొనుగోలు చేయాలని చూశారు. వీరికి ఒక్కొక్కరికీ 100 కోట్లు డబ్బు.. తర్వాత.. కాంట్రాక్టులు ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్‌హౌజ్‌లో భేటీ అయ్యారు. అయితే.. ఈ విషయాన్ని టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు చెప్పడం.. వారు వచ్చి మధ్య వర్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కీలకంగా మారింది. ఆతర్వాత.. టీఆర్ ఎస్.. దీనిని రాజకీయం చేసింది.
ఇవీ.. అనుమానాలు.. !
+ అయితే.. ఇక్కడే కొన్ని ధర్మ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న మాట వాస్తవమే అయినా ఈ సమయంలో బీజేపీ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుంది?
+ అంతేకాదు కేవలం నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే టీఆర్ ఎస్ పార్టీ పడిపోతుందా? ఇప్పటికిప్పుడు వాళ్లతో మునుగోడు ఉప ఎన్నికల్లో పొలిటికల్ గా ఏమైనా లాభం ఉంటుందా? బీజేపీ నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి 400 కోట్ల రూపాయలు ఇవ్వడానికి, అంత భారీ రేట్లతో ఎందుకు ప్రయత్నించింది. ఆ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి వంద కోట్లు పెట్టి కొనేంత ప్రాధాన్యత ఉందా? వీరి వల్ల బీజేపీ నేతలు సాధించేది ఏముంటుంది.? అనేది కీలకంగా మారింది.
ఇదిలాఉంటే.. బీజేపీలోకి ఎవరు రావాలన్నా రాజీనామా చేసిన తర్వాతే రావాలన్నా కండిషన్ ఉంది. మరి అలాంటప్పుడు నిజంగానే బిజెపి ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నిస్తే దాని వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటి అన్నది కూడా పెద్ద ప్రశ్నగానే మిగిలింది. ఒక్కొక్కరికి వంద కోట్లు ఇచ్చి, నలుగురికి అడ్వాన్స్ గా 15 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తే, ఎమ్మెల్యే లే తమను ట్రాప్ చేయడానికి బిజెపి నాయకులు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫోన్ చేసి రమ్మని చెప్పారని సమాచారం.
ఇక పోలీసులు వచ్చిన తర్వాత ఈ కొనుగోలు వ్యవహారం తమకేమీ తెలియదని అక్కడి నుండి ఎంచక్కా ప్రగతి భవన్ కు వెళ్లి కూర్చున్నారు. నిజంగా ఎమ్మెల్యేలు పోలీసులను బిజెపి వారిని పట్టించాలని రమ్మంటే, అక్కడే ఉండి ఆ కేసు విషయంలో పోలీసులకు సహకరించాలి కదా?! కానీ అలా కాకుండా మీడియాలో ముందే వీడియోలు రావడం, ఆ పై పోలీసులు దాడి చేయడం, అక్కడ నుంచి ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు చేరుకోవడం ఏమిటి అన్నది ఆసక్తిగా మారింది.
పోలీసులు మిస్సయిన కీలక విషయం.. ఏంటంటే..ఈ కేసులో ఇంత వరకు పోలీసులు డబ్బులు ఎక్కడ ఉన్నాయో చూపించలేదు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కూడా.. ఇదే విషయాన్ని వెల్లడించారు. డబ్బులు పట్టుబడలేదన్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తున్నట్టు,.. ఫోన్‌లో కేంద్ర మంత్రి ఒకరు( కిషన్ రెడ్డి) మాట్లాడారని చెబుతున్నట్టు జరుగుతున్న ప్రచారం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
చేరికల కమిటీకి బాధ్యుడు ఈటల రాజేందర్ అయితే కిషన్ రెడ్డి ఈ వ్యవహారంలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు. అసలు ఆయన పేరు ఎందుకు చర్చనీయాంశంగా మారింది అన్నది కూడా ప్రశ్నగానే ఉంది. ఇక, బీజేపీ కొనుగోలు చేయాలని ప్రయత్నించిన నలుగురు ఎమ్మెల్యేల లో ముగ్గురు ఎమ్మెల్యేలు గతంలో గెలిచిన పార్టీ నుంచి జంపు జిలాని అన్న వాళ్లే, ఇక అటువంటి వారికోసం స్వామీజీలు వందలకోట్ల నోట్ల కట్టలు తీసుకొని వస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
100 కోట్లు పెట్టి కొనేంత సీన్ ఆ ఎమ్మెల్యేలకు ఉందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక పోలీసులకు దొరికిన స్వామీజీలు బీజేపీకి సన్నిహితులు అని చెప్పడం కోసం టిఆర్ఎస్ సోషల్ మీడియా సహా .. ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాలు కూడా.. బోలెడన్ని ఫోటోలను, వీడియోలను చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా ఇంత తక్కువ సమయంలో జరగడం అంటే, ఇది ప్రీ ప్లాన్డ్ వ్యవహారమా అన్నది కూడా ప్రశ్నగా మారింది.
మొత్తంగా.. దీని వెను ఏదో జరిగిందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. మరి ఏంటో తేలాలంటే.. కొంచెం వెయిట్ చేయక తప్పదేమో!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.