Begin typing your search above and press return to search.

మునుగోడు సిత్రాలు: ప్రతీ ఇంటికీ మద్యం, మాంసం, కూల్ డ్రింక్స్.. పండుగ చేసుకోండి

By:  Tupaki Desk   |   20 Oct 2022 11:12 AM GMT
మునుగోడు సిత్రాలు: ప్రతీ ఇంటికీ మద్యం, మాంసం, కూల్ డ్రింక్స్.. పండుగ చేసుకోండి
X
మునుగోడులో తాగినోళ్లకు తాగినంత.. తిన్నోళ్లకు తిన్నంతగా మారింది. పార్టీ భారీగా ఖర్చు చేస్తున్నాయి. కుటుంబాలకు ప్రతీ ఇంటికి కిలో చికెన్, కూల్ డ్రింగ్స్, మద్యంను పంపిణీ చేస్తున్నారు. మునుగోడులో ఉప ఎన్నికలు రావడంతో ఇప్పుడు ప్రజలంతా పండుగ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంచేస్తూ ప్రజలకు పంచిపెడుతూ బిజీగా ఉన్నాయి.

అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీలు ఇక్కడ బలమైన అభ్యర్థులతో భారీగా పంచుడు షురూ చేశాయి. విజయం సొంతం చేసుకోవాలని మందు,విందులు ఏర్పాటు చేస్తున్నాయి. మునుగోడులోనే టీఆర్ఎస్,బీజేపీ మంత్రులు, కేంద్రమంత్రులు మోహరించారు.

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలోని మండలాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు తంటాలు పడుతున్నారు. చౌటుప్పల్ లోని ఓ గ్రామంలో తెల్లవారుజామున 5 గంటలకే ప్రతీ ఇంటికి కిలో చికెన్, 2 లీటర్ల కూల్ డ్రింగ్ ను పంపిణీ చేశారు. గ్రామంలో సుమారు 800 ఇళ్లకు, ఒక గంటలోనే 90శాతం ఇచ్చేశారు.దీనికి అదనంగా వ్యక్తిగత తాయిలాలు, గ్రామ అవసరాలు తీరుస్తూ తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.

ఇక చండూరు మండలంలోని పుల్లెం గ్రామంలోనూ 700 ఇళ్లకు చికెన్ పంపిణీ చేశారు. బైక్ లపై వెళ్లి మరీ ఈ పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఎలాంటి కులాల వారీగా విందులు, ఇంటింటికి చికెన్, మద్యం , నగదు పంపిణీతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు.

ఓటర్లు మాత్రం మునుగోడు ఎన్నికలతో పండుగ చేసుకున్నారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల నాయకులు చూపిస్తున్న ప్రేమకు షాక్ అవుతున్నారు. ఎన్నికలు ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగుంటుందని చెప్పుకుంటున్నారు.

ఎన్నికలు లేకపోతే ప్రజల సమస్యలను పట్టించుకునే వారే ఉండరని.. ఎన్నికలు వస్తున్నాయంటే జీ హుజూర్ అంటూ ఓటర్ల చుట్టూ తిరుగుతున్నారని చర్చించుకుంటున్నారు. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికలతో ఓటర్లకు ఫుష్టిగా తిండి, మద్యం, నగదు లభిస్తుందన్నమాట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.