Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్-బీజేపీ ఫైట్: మునిగింది కోమటిరెడ్డి బ్రదర్సే?

By:  Tupaki Desk   |   4 Nov 2022 9:30 AM GMT
టీఆర్ఎస్-బీజేపీ ఫైట్: మునిగింది కోమటిరెడ్డి బ్రదర్సే?
X
మును'గోడు' ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. టీఆర్ఎస్ గెలవబోతోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టాయి. ఏకంగా 92 శాతానికి పైగా పోలింగ్ జరడంతో అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పోరులో టీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉందని తేలింది. కారణం ఏదైనా ఈ మునుగోడు ఫైట్ లో టీఆర్ఎస్, బీజేపీ పంతంలో నిండా మునిగింది మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తమ్ముడు బీజేపీలో చేరి రాజకీయ భవిష్యత్ చెడగొట్టుకోగా.. కాంగ్రెస్ లో ఉండి బీజేపీలో చేరిన తమ్ముడిని గెలిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలతో వెంకటరెడ్డి అభాసుపాలయ్యారు.

మునుగోడులో ఓడిపోతే రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్ నే గందరగోళంలో పడడం ఖాయం. ఎందుకంటే ఇన్నాళ్లు అన్న చాటు తమ్ముడిగా గెలిచాడు. ఇప్పుడు పార్టీ మారి ఓడిపోతే అన్న పట్టించుకోడు. తిరిగి కాంగ్రెస్ లోకి రాలేడు.

ఇటు బీజేపీ నుంచి గెలవలేకపోయాడు. సో రాజగోపాల్ రెడ్డి నిండా మునిగినట్టే అవుతుంది. వ్రతం చెడ్డా (పార్టీ మారినా) ఫలితం దక్కలేదన్నట్టుగా మారుతుంది. ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డికి బీజేపీలో అసలు ప్రాధాన్యత దక్కదు. మరోసారి గెలిచే ఛాన్స్ ఉండదు.

ఇక తమ్ముడి కోసం సొంత కాంగ్రెస్ నే కాలదన్నేలా కుట్రలు చేసిన వెంకటరెడ్డి రాజకీయాల్లో బ్యాడ్ అయిపోయారు. ఆయనను కాంగ్రెస్ వెలివేసే ప్రమాదం ఉంది. మొత్తంగా బ్యాడ్ అయిపోయి రాజకీయంగా ఎవరూ నమ్మని స్థితికి వెంకటరెడ్డి దిగజారారు. అటు కాంగ్రెస్ లో భవిష్యత్ ఉండక ఇటు బీజేపీలో చేరుదామన్న పిలుపు రాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్రిశంఖు స్వర్గంలో పడిపోతారు.

మునుగోడుతో తొడగొట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తను ఓడడమే కాదు.. అన్నయ్య వెంకటరెడ్డి రాజకీయ భవిష్యత్ ను ఇరకాటంలో పెట్టేశారు. 18వేల కాంట్రాక్ట్ కోసమే ఆయన చేరారని టీఆర్ఎస్ చేసిన ప్రచారం కూడా ఆయన ఓటమికి దారితీసింది. ఇక బీజేపీ ఇస్తామన్న ఆ అతిపెద్ద కాంట్రాక్ట్ కూడా ఓటమితో ఇస్తారో లేదో..

ఇలా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ మునుగోడు రాజకీయ సమాధి చేసినా చేయవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం చూస్తున్న బీజేపీకి ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ వెల్ల బొక్కపడిందనే చెప్పాలి. ఫాంహౌస్ ఎపిసోడ్ కూడా బీజేపీని ఇరుకునపడేసింది. మొత్తంగా మునుగోడుతో ఇటు బీజేపీకి, అటు కోమటిరెడ్డి బ్రదర్స్ కు తీవ్ర నష్టమే కలిగిందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.