Begin typing your search above and press return to search.
మునుగోడు ఉప ఎన్నికలో 56 మంది నామినేషన్లు దాఖలు
By: Tupaki Desk | 14 Oct 2022 3:39 PM GMTతెలంగాణలో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఉప ఎన్నికలో శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటివరకూ 56మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం ఒక్కరోజే 24మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.
టీఆర్ఎస్ తరుఫున అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గురువారం నామినేషన్ వేశారు. మంత్రి కేటీఆర్ తో కలిసి జనంతో భారీ ర్యాలీగా వచ్చి మరీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ప్రభాకర్ రెడ్డి తనకు రూ.9.15 కోట్ల స్థిర, చరాస్థులు ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు.
ప్రస్తుతం చేతిలో 45వేలు, లక్ష విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్టు తెలిపారు. 1.56 కోట్ల అప్పు ఉన్నట్టు పేర్కొన్నాడు. భార్య అరుణారెడ్డి పేరిట రూ.6.84 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నట్టు తెలిపారు. ఆమెకు రూ.600 గ్రాముల బంగారం, రూ.55వేల నగదు ఉన్నట్టు తెలిపారు. ఇద్దరి పేరుతో 22 ఎకరాల భూమి ఉన్నట్టు పేర్కొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , సీనియర్లు ఉత్తమ్, దామోదర్ రెడ్డి, జానారెడ్డి, భట్టి, ఇతర రాష్ట్ర నేతలు హాజరయ్యారు.
తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక తాజాగా మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతు తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీలను ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 6న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 7న విడుదల కానుంది. ఈనెల 14 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది 17. 15న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. నవంబర్ 3న ఎన్నికలు నిర్వహిస్తారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.