Begin typing your search above and press return to search.
చెరో రూ.100 కోట్లు కుమ్మరించేందుకు రెఢీ అవుతున్నారా?
By: Tupaki Desk | 4 Aug 2022 4:48 AM GMTరెండు మద గజాలు ఢీ కొంటే ఎలా ఉంటుంది? ప్రశ్న వరకు బాగానే ఉన్నా.. ప్రాక్టికల్ గా చూడటం సాధ్యమా?అన్న సందేహం ఉన్న వారికి.. రానున్న రోజుల్లో జరిగే మునుగోడు ఉప ఎన్నిక ఆ సీన్ ను చూపిస్తుందన్న మాట వినిపిస్తోంది. భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలకు ఆరంభ సీన్ గా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం నిలుస్తుందని చెబుతున్నారు.
జీరో కాస్తా హీరో.. హీరోను జీరో చేసే సత్తా ఉన్న మునుగోడు ఉప ఎన్నికను ఏ మాత్రం తీసిపారేయటానికి వీల్లేదంటున్నారు. ఉప ఎన్నికల ఆటతో ఈ స్థాయికి వచ్చిన గులాబీ బాస్ కేసీఆర్ కు.. మునుగోడు ఉప ఎన్నిక ప్రాధాన్యత అందరికంటే ఎక్కువగా ఆయనకే తెలుసుంటారు.
అందుకే.. ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం ఖాయమని చెప్పాలి. తాజా ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతుందని చెబుతున్నా.. వాస్తవ కోణంలో చూస్తే.. పోటీ నడుస్తున్నది అధికార టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీనే అని చెప్పక తప్పదు.
ఈ ఎన్నికల ఫైట్ లో ఎవరి బలం ఏమిటి? అన్న విషయంపై క్లారిటీ వచ్చే వీలుందని చెబుతున్నారు. అందుకే.. ఈ ఉప ఎన్నిక ఇప్పటివరకు తెలంగాణలో జరిగిన సాధారణ ఎన్నికలు.. ఉప ఎన్నికల్లో అత్యంత ఖరీదైన వ్యవహారంగా భావిస్తున్నారు.
తక్కువలో తక్కువ రూ.100 కోట్ల ఖర్చు ఈ ఉప ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పక్షాలు ఒక్కొక్కటిగా ఖర్చు పెట్టే వీలుందంటున్నారు. ఈ భారీ ఖర్చుకు అధికార టీఆర్ఎస్ ఎప్పుడో రెఢీ కాగా.. ఉప ఎన్నికకు కారణమైన బీజేపీ సైతం ఆ దిశగా ఇప్పటికే సిద్ధమైందన్న మాట వినిపిస్తోంది. ఈ రెండు పార్టీలు కాకుండా మూడో పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం ఆ స్థాయి ఖర్చుకు సిద్ధం కాలేదంటున్నారు.
ఒక అంచనా ప్రకారం చూస్తే.. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రూ.150 కోట్ల వరకు ఏదో ఒక పార్టీ (మెజార్టీ టీఆర్ఎస్ అనే మాట వినిపిస్తోంది) ఖర్చు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ముఖ్యం తప్పించి డబ్బులు కాదన్న థియరీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఉప ఎన్నిక ఫలితం ఫ్యూచర్ రాజకీయాల్ని ప్రభావితం చేసే సత్తా ఉండటంతో.. ఖర్చు గురించి వెనుకా ముందు ఆడే అవకాశమే లేదంటున్నారు. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికల్లో నోట్ల కట్టలు పెద్ద ఎత్తున ప్రవహించటంఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూద్దాం.