Begin typing your search above and press return to search.
మునుగోడు ఫలితం.. ఖమ్మం పాలిటిక్స్‌ను మార్చేస్తుందా?
By: Tupaki Desk | 30 Aug 2022 9:38 AM GMTరాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామం ఎదురవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగిన మూడు ఉప ఎన్నికల(దుబ్బాక, సాగర్, హుజూరాబాద్) తర్వాత.. బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్వరలోనే జరగనున్న నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను నిర్దేశించనున్నాయా.. ఇక్కడ రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
పలు పార్టీల్లోని అసంతృప్త నేతలు తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ ఎన్నికలనే గీటురాయిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు తమ భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ఎన్నికల అనంతరం ప్రజాతీర్పు ఆధారంగా నిర్ణయాలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరు అసంతృప్త నేతలు ఈ విషయమై దృష్టి సారించినట్లు సమాచారం.
అధికార టీఆర్ఎస్లో టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య అధికంగానే ఉంది. పార్టీలో టికెట్లు ఆశిస్తున్న వారితోపాటు ఇతర నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల వ్యవహార శైలితో అసంతృప్తితో ఉన్న నేతలు ఇప్పటివరకైతే గుంభనంగానే ఉంటున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ అధికార పార్టీలో రెండేసి వర్గాలు గ్రూపులు కట్టాయి. ఆయా వర్గాల నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. కొందరు నేతలు బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
పాలేరు, వైరా, సత్తుపల్లి, ఇల్లెందు, పినపాక వంటి నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. దీంతో కొందరు నేతలు తమ దారి తాము చూసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మునుగోడు ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్లో భారీ కుదుపు ఉండొచ్చనే ప్రచారం మొదలైంది.
కాంగ్రెస్ పార్టీ జిల్లాలో పుంజుకోవాలంటే చెప్పుకోదగిన రీతిలో స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పార్టీలో కూడా అంతర్గతంగా అసంతృప్తి రగులుతోంది. ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే శక్తియుక్తులు కలిగిన నేతల అవసరం ఉండగా... ప్రజావ్యతిరేక చర్యలపై నిరసనలు తెలుపుతున్నా నాయకులు ఏకతాటిపైకి రావడం లేదు. దీంతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కావాలంటే మునుగోడు ఎన్నికల్లో ఆ పార్టీ ఫలితాలే ఆధారమని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.