Begin typing your search above and press return to search.
మునుగోడు ఎన్నికల వేళ బీజేపీకి షాక్ ల మీద షాక్ లు
By: Tupaki Desk | 24 Oct 2022 4:47 AM GMTమునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీకి మరో షాక్ తగిలింది. తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇందులో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. రెండు పార్టీలు ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కూడా ఊపందుకుననాయి. ఇది బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
తాజాగా బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోల్ ఆనంద్ భాస్కర్ సైతం బీజేపీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో చేరికకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటివరకూ బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ రాపోల్ ఆనంద్ భాస్కర్ టీఆర్ఎస్ లో చేరడానికి రెడీ అయ్యారు. ఆదివారం రాత్రి ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో భేటి అయ్యారు.
పద్మశాలి సంఘం నాయకుడు, సీనియర్ జర్నలిస్ట్ అయిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడంతో ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని రాపోల్ ఆనంద్ భాస్కర్ ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. నేతన్నలకు బీజేపీ వల్ల జరుగుతున్న అన్యాయం చూడలేకపోతున్నానని.. తాను నేత కుటుంబం నుంచి వచ్చానని.. బీజేపీ నిర్వాకాలను భరించలేకపోతున్నానని ఆయన సీఎం కేసీఆర్ తో చెప్పినట్లు సమాచారం.
చేనేతపై జీఎస్టీ వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతానని ఆయన సీఎం కేసీఆర్ తెలిపారు. చేనేత రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. సిరిసిల్ల సహా చేనేతన్నలకు కేసీఆర్ సర్కార్ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని కొనియాడారు.
త్వరలోనే బీజేపీకి రాజీనామా చేస్తానని పేర్కొన్న రాపోలు తన రాజీనామా వెనుక ప్రధాన కారణం చేనేతలపై జీఎస్టీ వేయడమేనన్నారు.ఇక ఇప్పటికే స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ బీజేపీకి షాకిచ్చి టీఆర్ఎస్ లో చేరగా.. ఇప్పుడు రాపోల్ చేరిక బీజేపీకి మరింత షాక్ లా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.