Begin typing your search above and press return to search.
కబుర్లొద్దు.. కార్యాచరణ చెప్పు పవన్
By: Tupaki Desk | 30 March 2017 7:29 AM GMTఅగ్రిగోల్డు వ్యవహారంలో ఏదో చేస్తారనుకున్న జనసేన అధినేత పవన్ ఉసూరుమనిపించడంతో బాధితులు నిరాశపడుతున్నారు. పవన్ మాటలు చెప్పడం మానేసి ఈ విషయంలో తన కార్యాచరణ ప్రకటించాలని డిమాండు చేస్తున్నారు. తమ సమస్యలన్నీ విని తన దారిన తాను పోతే ప్రయోజనం ఉండదని.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అంటున్నారు. అంతేకాదు.. పవన్ గత చరిత్రనూ గుర్తు చేస్తున్నారు. గతంలో ఆయన ఏఏ అంశాలపై పోరాటం ప్రకటించారు.. అందులో ఎన్ని పోరాటాలు కొనసాగించారో చెప్పాలని ప్రశ్నించేవారూ ఉన్నారు. ఇదంతా పవన్ తో అయ్యే పనికాదని.. ఆయన మాటల మనిషే కానీ, చేతల మనిషి కాదని.. ఆరంభం శూరత్వమే తప్ప సమస్యల అంతుతేల్చే సత్తా, పట్టుదల ఆయనకు లేదని చెబుతున్నారు. పైగా చంద్రబాబు, మోడీ వంటి నేతల వద్ద ఆయనకు బాగా మొహమాటమని.. ఒక్క మాట ఎక్కువగా మాట్లాడాలన్నా భయమని అంటున్నారు.
ఈ నేపథ్యంలో అగ్రిగోల్డు బాధితులు కూడా సగం అనుమానం ఉన్నా సరే చూద్దాం.. ఏమైనా చేయగలిగితే మంచిదే కదా అన్న ఉద్దేశంతో పవన్ ను కలిసేందుకు అంగీకరించారట. తీరా కలిశాక పవన్ వద్ద దీనికి నిర్దిష్ఠమైన పరిష్కారం కానీ.. పరిష్కారం కోరుతూ చేయాల్సిన పోరాటానికి వ్యూహం కానీ లేవని తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటానన్న ప్రకటనలు చేస్తే చాలదని.. న్యాయం జరిగేలా ఉద్యమించి, ఆచరణలో చూపాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు పవన్ ను కోరడాన్ని బట్టి పవన్ పై ఎలాంటి ముద్ర ఉందో అర్థమవుతుంది.
ఎన్నో రాజకీయ పార్టీలు తమను ఆదుకోవాలని చూసి, కేవలం డిమాండ్ చేయడం వరకే చేసి ఆగిపోయాయని, జనసేన కూడా అలా మాటలు చెప్పి తప్పించుకోవద్దని సూచించారు. ప్రభుత్వం చేత పని చేయిస్తానన్న విశ్వాసాన్ని బాధితుల్లో కల్పించాల్సిన అవసరం ఉందని, ఆ మేరకు పవన్ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. అయితే.. జగన్ గతంలో రాజధాని రైతుల విషయంలో కానీ, మెగా ఆక్వా ఫుడ్ పార్కు విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ ప్రతి విషయంలోనూ మొదలు పెట్టి వదిలేయడమే అలవాటుగా చేసుకున్నారు. ఇప్పు అగ్రిగోల్డు ఇష్యూను కూడా నాల్రోజుల తరువాత ఆయనకు గుర్తుంటుందో లేదో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/