Begin typing your search above and press return to search.

మోడీ విధేయుడి నోట‌.. ఏపీలో జ‌గ‌న్ గెలుపు మాట‌!

By:  Tupaki Desk   |   8 May 2019 1:14 PM GMT
మోడీ విధేయుడి నోట‌.. ఏపీలో జ‌గ‌న్ గెలుపు మాట‌!
X
ఏపీలో జ‌గ‌న్ గెలుపు ప‌క్కా అంటూ ఇప్ప‌టికే ప‌లువురు చెబుతున్న వేళ‌.. తాజాగా ఆ జాబితాలో చేరారు ప్ర‌ధానికి అత్యంత స‌న్నిహితుడైన తెలుగు బీజేపీ నేత.. బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర్ రావు. తాజాగా ఆయ‌న తెలుగు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నిక‌ల ఫ‌లితాల మీద త‌న అంచ‌నాల్ని ఆయ‌న చెప్పుకొచ్చారు. కేంద్రంలో మోడీ చేతికి అధికారం ఖాయ‌మ‌ని చెబుతూ.. అదెలా సాధ్య‌మ‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఇదిలా ఉంటే.. ఏపీలో ఎవ‌రు విజ‌యం సాధిస్తార‌న్న విష‌యాన్ని చెబుతూ.. పోల్ మేనేజ్ మెంట్ లో చంద్ర‌బాబును త‌క్కువ అంచ‌నా వేయ‌లేమ‌ని.. అయితే.. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 110 సీట్లు గెలుచుకోవ‌టం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. త‌న‌కున్న స‌మాచారం ప్ర‌కారం జ‌గ‌న్ గెలుపు మీద ధీమా వ్య‌క్తం చేశారు.

అయితే.. బాబు పోల్ మేనేజ్ మెంట్ వ్యూహ‌చ‌తుర‌త కార‌ణంగా.. బాబు గెలిచినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించ‌టం విశేషం. ఏపీలో అంద‌రూ అనుకున్న‌ట్లుగా మోడీ వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా లేద‌ని చెప్పారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. జ‌గ‌న్ కు బీజేపీ ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ప‌లికింద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. దీనికి త‌గ్గ‌ట్లే.. తాజాగా ముర‌ళీధ‌ర్ రావు నోటి వెంట జ‌గ‌న్ గెలుపుపై ధీమాను వ్య‌క్తం చేశారు.

ఇక‌.. ఏపీలో జ‌రిగిన సీట్ల‌ న‌ష్టం తెలంగాణ‌లో భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పిన ఆయ‌న‌.. తాము ఆరు ఎంపీ స్థానాల్లో విజ‌యం సాధిస్తామ‌ని చెప్పారు. త‌మిళ‌నాడులో కూడా భారీగా సీట్లను సాధిస్తామ‌ని చెప్పారు. నెల రోజుల్లో ప‌రిస్థితుల్లో చాలా మార్పులు వ‌చ్చాయ‌ని.. తొలుత యూపీలో 35 నుంచి 40 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని అనుకున్న‌ట్లు చెప్పారు. తాజాగా ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చింద‌ని.. ఖాయంగా 70 సీట్లు వ‌స్తాయ‌ని చెప్పారు.

దేశ వ్యాప్తంగా త‌మ మిత్ర‌ప‌క్షాల‌కు 45 నుంచి 50 సీట్లు వ‌చ్చే వీలుంద‌ని.. మోడీ మ‌ళ్లీ ప్ర‌ధాని అవుతార‌ని జోస్యం చెప్పారు. మోడీ నేతృత్వంలో బీజేపీకి 290 నుంచి 310 స్థానాలు గెలుచుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. తెలంగాణ‌లో ఆరు ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుపొంద‌నున్న‌ట్లుగా చెప్పిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.