Begin typing your search above and press return to search.

బీజేపీ నేత క్లారిటీ..త‌ర్వాత కూల‌బోయేది కేసీఆర్ స‌ర్కారే

By:  Tupaki Desk   |   30 July 2019 6:05 PM GMT
బీజేపీ నేత క్లారిటీ..త‌ర్వాత కూల‌బోయేది కేసీఆర్ స‌ర్కారే
X
అనేక ఎత్తులు - సస్పెన్స్‌ లు - రాజ‌కీయాల మ‌ధ్య కర్ణాటక పీఠం తిరిగి మ‌ళ్లీ బీజేపీకి ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. సీఎం యెడియూరప్ప బలపరీక్షలో నెగ్గారు. సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో ప్రభుత్వం మెజార్టీ సాధించింది. వాయిస్ ఓట్ విధానంలో ఓటింగ్ - కౌంటింగ్ జరిపారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన కనీస ఎమ్మెల్యేల సంఖ్య 105 కాగా.. బీజేపీ సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ అందుకున్నది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే హెచ్ నగేశ్ సైతం మద్దతు పలికారు. తర్వాత స్పీకర్ రమేశ్‌ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదే ఊపులో బీజేపీ త‌ర్వాతి రాష్ట్రం కోసం స్కెచ్ మొద‌లుపెట్టింది. త‌ర్వాత త‌మ టార్గెట్ కేసీఆర్ అని బీజేపీ నేత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

నెలరోజులుగా హైడ్రామా కొనసాగుతున్న కర్ణాటక అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష సజావుగా సాగింది. సీఎం యెడియూరప్ప విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఓటింగ్‌ కు స్పీకర్ దూరంగా ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మద్దతు దక్కడంతో బీజేపీ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది.ఈ ప‌రిణామాల‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిన్న కర్నాటక.. రేపు తెలంగాణ.. అని కామెంట్ చేశారు. టీఆర్ ఎస్‌ కు అసలైన రాజకీయ ప్రత్యర్థి.. బీజేపీనే అని పేర్కొన్నారు. రాజకీయ పోరాటం అంటే ఏంటో చూపిస్తామన్నారు.

క‌ర్ణాట‌క‌లోని ప‌రిణామాల‌ను పేర్కొంటూ యడియూరప్ప ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటు ద్వారా దక్షిణాదిన పార్టీ విస్తరణ స్పీడైందని ముర‌ళీధ‌ర్ రావు అన్నారు. కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా.. హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్ వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారని తెలిపారు. ఇదే ఒర‌వ‌డిలో తెలంగాణ కార్య‌క‌ర్త‌లు త‌మ రాష్ట్రంలోని ప్ర‌భుత్వం గురించి సైతం సంబురాలు చేసుకుంటార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.