Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీపై లండన్ లో మర్డర్ కేసు

By:  Tupaki Desk   |   23 Oct 2015 8:09 AM GMT
ప్రధాని మోడీపై లండన్ లో మర్డర్ కేసు
X
ప్రధాని మోడీపై లండన్ లో మర్డర్ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేయాలని కూడా ఇంగ్లాండ్‌ లో కేసు నమోదైంది. తారిఖ్ మహ్మద్ అనే ముస్లిం సామాజికవేత్త ఇంగ్లండ్‌ లోని డెఫ్రాడ్ పోలీస్ స్టేషన్‌ లో మోడీపై ఈ ఫిర్యాదు చేశాడు. అయితే ఇది లండన్ లో జరిగిన మర్డరుకు సంబంధించింది కాదు.. గుజరాత్ లో ముగ్గురు బ్రిటిష్ పౌరుల మరణానికి సంబంధించింది. అయినా, మోడీ వచ్చే నెలలో బ్రిటన్ పర్యటనకు వెళ్లనుండడంతో ఈ కేసు ఆయనకు ఎలాంటి ఇబ్బందులు సృష్టిస్తుందో చూడాలి.

2002లో గుజరాత్‌ లో అల్లర్లు జరిగిన సమయంలో ముగ్గరు బ్రిటీష్ పౌరులు మరణించడానికి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీయే కారణమని ఆరోపిస్తూ తారిఖ్ లండన్ లో కేసు పెట్టాడు ఈ ఘటనపై భారత ప్రధాని మోడీని పూర్తి బాధ్యుణ్ణి చేస్తూ వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో రాశాడు. మోడీ నవంబర్‌ లో బ్రిటన్ లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఆయన బ్రిటన్ లో అడుగుపెట్టగానే అరెస్ట్ చేయాలని మహ్మద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌ లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌ ప్రెస్ లో మంటల్లో 59 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో అధికులు అయోధ్య నుంచి వస్తున్న కరసేవకులు. ఈ ఘటన అనంతరం గుజరాత్‌ లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. దాడులు - ప్రతిదాడులు - మారణాయుధాలతో వీధుల్లో స్వైరవిహారాలు - దహనాలు - లూఠీలు - హత్యలు - మానభంగాలు - సజీవ దహనాలతో 150 పట్టణాలు - వేలాది గ్రామాలు అల్లకల్లోలమయ్యాయి. ఈ అల్లర్లలో మొత్తం 1200కు పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పలువురు విదేశీయులూ మృతిచెందారు.