Begin typing your search above and press return to search.
చేప పై మర్డర్ కేసు.. అసలేం జరిగింది..?
By: Tupaki Desk | 4 Feb 2022 1:32 PM GMTఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం జిల్లాలో ఓ చేపపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏకంగా హత్య కేసు పెట్టారు. ఐపీసీ సెక్షన్ 302 కింద చేపపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దీనికి గల ప్రధాన కారణం ఆ చేప ఓ మనిషి ప్రాణం తీయడమే. ఇందకుగానూ ఆ చేపను చట్టం పరిధిలోకి తీసుకుని వచ్చి కేసు నమోదు చేశారు. అధికారులు చేసిన ఈ పని వినేందుకు వింతగా ఉన్నా కానీ నిజంగా ఆ చేప ఓ మత్స్యకారుడు ప్రాణం తీసింది.
సాధారణంగా మత్స్యకారులు చేపలను వేటాడుతారు. అందుకోసం నదుల్లోకి, సముద్రాలోకి వెళ్తారు. అలానే సముద్రంలోకి వెళ్లాడు విశాఖకు చెందిన ఓ మత్స్యకారుడు. సుమారు సముద్రతీరం నుంచి 80 నాటికన్ మైళ్ల దూరం వెళ్లిన తరువాత ఓ చేప అతనిపై సడన్ గా దాడి చేయడం ప్రారంభించింది. దీంతో అతను అక్కడ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన కానీ వదిలి పెట్టలేదు. మత్స్యకారుడు వేటాల్సింది పోయి.. ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. దానికి బదులు ఏకంగా చేప వేట ప్రారంభించింది. ఈ ప్రయత్నంలోనే మత్స్యకారుడు చివరకు ప్రాణాలను కోల్పోయాడు. దీంతో ఆ వ్యక్తి మృతికి కారణం అయిన చేపపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి చేపలు సముద్రంలో ఇంకా చాలా ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. దీనిని కొమ్ముకోనెం చేప అని అంటారని అధికారులు అంటున్నారు.
చనిపోయిన వ్యక్తిని పరవాడ ముత్యాలమ్మపాళెంకు చెందిన జోగన్నగా పోలీసులు గుర్తించారు. జోగన్న తో పాటు ఆ రోజు వేటకు వెళ్లిన వారి వివరాలు కూడా పోలీసులు సేకరించారు. వారి చెప్పిన దాని ప్రకారం... వారంత మంగళవారం సముద్రంలోకి వెళ్లారు. సుమారు 8 కి.మీ వెళ్లగానే వారి వలలో చేపలు పడ్డాయి. వల బరువుగా అనిపించింది. దీంతో తలో ఒక చెయ్యి వేయి గట్టిగా లాగాలి అనుకున్నారు. ఎంతకీ రాకపోవడంతో వల బోటుకు తగులుకుందనే అనుమానంతో జోగన్న తప్పించే ప్రయత్నంలో నీటిలోకి దిగారు. అప్పడే ఆ చేప ఆయనపై దాడి చేసింది. బలంగా ఆయన పొట్టపై గుచ్చి గాయపరిచింది. దీంతో జోగన్న ఊపిరాడక చనిపోయారు.
అనంతరం ఒడ్డుకు తీసుకుని వచ్చిన సహచరులు జరిగిన విషయం చెప్పారు. మృతుడి శరీరాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లికి పంపారు. రిపోర్టులో చేపదాడి చేయడం కారణంగా చనిపోయాడని తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ చేపపై ఎటువంటి చర్యలకు పోలీసులు ఉపక్రమిస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.