Begin typing your search above and press return to search.
సాధువుల హత్యకేసు: నిందితుడికి కరోనా పాజిటివ్ !
By: Tupaki Desk | 2 May 2020 10:30 AM GMTమహారాష్ట్రలోని పాల్గాడ్ జిల్లాలో ఇద్దరు సాధవులని అతిక్రతంగా హత్య చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. కల్పవృక్ష గిరిరాజ్, సుశీల్ గిరిరాజ్‌లతో పాటు మరో డ్రైవర్ ను , అనుమానంతో ఓ గుంపు కర్రలతో, రాళ్లతో కొట్టి అతి కిరాత కాలంగా హతమార్చారు. ఈ కేసులో మహారాష్ట్ర క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ ఇప్పటికే వంద మందిని అదుపులోకి తీసుకోగా తాజాగా మరో 15 మందిని కస్టడీలోకి తీసుకుని వాడా పోలీస్‌స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.
అయితే ఆ నిందుతుల్లో ఒకరు అస్వస్థతకు గురవ్వడంతో పాల్గర్ రూరల్ అస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే అతడిని జేజే ఆస్పత్రిలోని ప్రత్యేక జైల్ వార్డ్ కు తరలించి ఐసోలేషన్ లో ఉంచారు. అయితే వాడా పోలీస్‌స్టేషన్ లో ఈ నిందుతుడితో పాటు మరో 20 మందిని పోలీసులు ఒకే గదిలో ఉంచారు.
దీంతో ఆ గదిలో ఉన్న మిగతా 20 మందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సాధువులను హత్య చేసిన అనంతరం నిందితులు అడువుల్లోకి పారిపోయారు. అయితే వారి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రోన్లను ఉపయోగించి వారి జాడ కనిపెట్టారు. ఇక ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో 9 మంది మైనర్లు, ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.