Begin typing your search above and press return to search.
ఏ ఎండకాగొడుగు.. 'బండ్ల' బాగా డెవలప్డ్
By: Tupaki Desk | 3 Oct 2018 6:08 AM GMTబండ్ల గణేష్.. 15 ఏళ్లప్పుడు ఇంటి నుంచి బయటపడి స్వతహాగా ఎదిగాడట. చిన్న చిన్న సినిమా పాత్రలు చేసుకుంటూ అనంతరం పౌల్ట్రీ ఫారాలు స్థాపించి తెలుగు రాష్ట్రాల్లోనే నంబర్ 1 పౌల్ట్రీ ఫారాల యజమానిగా రూపాంతరం చెందాడట. అనంతరం నాటి కాంగ్రెస్ మంత్రి తో సాన్నిహిత్యంతో రాజకీయాలు ఒంటబట్టించుకున్నాడట.. టాలీవుడ్ లో బడా నిర్మాతల్లో ఒకరిగా ఎదిగాడట.. ఇంత షార్ట్ టైం ఇంతలా ఎలా ఎదిగావనే ప్రశ్నకు మాత్రం బండ్ల సమాధానమివ్వలేకపోయారు.. తాజాగా తెలుగులోని ఓ ప్రముఖ న్యూస్ చానెల్ లో వివాదాస్పద జర్నలిస్టు ‘మూర్తి’ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ తన జీవిత విశేషాలను - రాజకీయ అడుగులను - తన బాస్ పవన్, తమ తాజా కూటమి భాగస్వామి చంద్రబాబు గురించి పలు హాట్ కామెంట్స్ చేశాడు. ఎంతో హాట్ హాట్ గా సాగిన ఈ ప్రసంగంలో బండ్ల గణేష్.. జర్నలిస్ట్ మూర్తినే గుక్కతిప్పుకోనివ్వకుండా భయపెట్టడం విశేషం. వివాదాలు అడిగితే వెళ్లిపోతానంటూ బెదిరించాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాలని కలలుగంటున్న బండ్ల గణేష్ మాట్లాడిన పలు మాటలు ఆసక్తి రేపుతున్నాయి.
*నాడు బాబును తిట్టి.. నేడు ఆకాశానికెత్తి..
ఇంటర్వ్యూలో అంతా బాగానే ఉన్నా.. ఆయన రాజకీయ ప్రణాళిక చెప్పినప్పుడు మాత్రమే కొంత ఇరుకుపడిపోయాడు. పది నెలల క్రితం.. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని ఇదే బండ్ల గణేష్ చంద్రబాబును - బాలక్రిష్ణను తూర్పారపట్టారు. చంద్రబాబు నంది అవార్డులను తన ఇంట్లో వాళ్లకు - తన అన్నలకు - తమ్ముళ్లకు - తమ ఇంట్లో పనిచేసేవాల్లకు పంచుకున్నారని.. మెగా ఫ్యామిలీని కావాలనే పట్టించుకోలేదని చంద్రబాబును చీల్చిచెండాడాడు. కానీ ఇప్పుడు మూర్తి ఇంటర్వ్యూలో మాత్రం చంద్రబాబు వల్లే ఏపీ - హైదరాబాద్ అద్భుతమని.. ఆయనే అన్నీ నిర్మించారని.. చంద్రబాబు దేవుడు - శూరుడు - మహానుభావుడు అంటూ కొనియాడారు. పది నెలల కిందట తిట్టిన నోటితోనే ఇప్పుడు మహాకూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉండడంతో చంద్రబాబును బండ్ల పొగిడేయడం గమనార్హం.
*పవన్ గురించి అడిగితే వెళ్లిపోబోయాడు..
తన ఆరాధ్య దేవుడు పవన్ గురించి మూర్తి అడిగితే బండ్ల గణేష్ ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోబోయాడు. ఆయన నాకు దేవుడు. ఆయన పార్టీ వేరు నా పార్టీ వేరు. రాజకీయంగా విభేదించవచ్చు కానీ.. మేము విడిపోలేదని బండ్ల గణేష్ వివరణ ఇచ్చాడు. పవన్ పై కామెంట్ చేయించి తనను ఇరికిస్తే తాను ఇంటర్వ్యూ వదిలి వెళ్లిపోతానంటూ హల్ చల్ చేశాడు. కాంగ్రెస్ పార్టీని విభేదించే పవన్ శిష్యుడై ఉండి ఆ పార్టీలో ఎలా చేరావని మూర్తి అడిగితే.. ‘నాకు కాంగ్రెస్ అంటే ప్రేమ.. అభిమానం.. పవన్ అన్న అభిమానమే.. మానాన్న - అన్న వద్దంటున్నా కాంగ్రెస్ లో చేరా.. జనం కోసం సేవా చేస్తా’ అంటూ వివరణ ఇచ్చాడు..
*బండ్ల బినామీల గురించి అడిగితే..
బండ్ల గణేష్.. ఏపీకి చెందిన ఓ నేత బినామీ అని మూర్తి ప్రశ్నించగానే బండ్ల కాదంటూ వివరణ ఇచ్చాడు. ఆయనతో సాన్నిహిత్యం నిజమే కానీ.. నా పౌల్ట్రీ బిజినెస్ వల్లే నిర్మాత అయ్యానని.. పవన్ వల్ల సినిమాల్లో నిలదొక్కుకున్నానని వివరణ ఇచ్చాడు. ఎన్నికల్లో ఈసీ సూచన మేరకు 30 లక్షలు మాత్రమే ఖర్చు చేస్తానని.. కోట్లు ఖర్చు పెట్టనని వివరణ ఇచ్చాడు. అంతేకాదు.. తనపై ఉన్న చెక్ బౌన్స్ కేసు చాలా చిన్నదంటూ చెప్పుకొచ్చాడు. పూరి జగన్నాత్ కు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ కు ఐటీ నోటీసులు వచ్చాయని.. ఐటీకి రెగ్యులర్ గా కడుతున్నానన్నారు. హీరో సచిన్ తో వివాదం కోర్టులో నడుస్తోందన్నారు. హీరో రవితేజ ఓ భూతగాదా వచ్చిందన్నారు.
*మూర్తినే గడగడలాడించాడే..
పవన్ కళ్యాణ్ ను స్ట్రింగ్ ఆపరేషన్ తో ఇరుకున పెట్టిన జర్నలిస్టు మూర్తితో ఇంటర్వ్యూ అనగానే తాను భయపడ్డానని.. ఆయన ఇరికిస్తాడని ఫ్రెండ్స్ అందరూ చెప్పినా వినకుండా వచ్చానని.. మీరు ఎక్కువగా మాట్లాడితే వెళ్లిపోతానంటూ బండ్ల గణేష్ చేసిన హెచ్చరికలు బాగానే పనిచేశాయి. ఈ కండీషన్ పెట్టడంతో మూర్తి తాను అనుకున్న వివాదాస్పద అంశాలను గట్టిగా అడగలేకపోయారు. కేసీఆర్., వైసీపీ, చంద్రబాబుల గురించి అడిగి ఇరుకునపెడదామని చూసినా బండ్ల ఆ చాన్స్ ఇవ్వకుండా మాట మార్చేశాడు.
*మహాకూటమిలో టీడీపీ.. బాబుపై స్టాండ్ మార్చిన బండ్ల
ఏ ఎండకా గొడుగు పట్టేవాడే రాజకీయ నాయకుడు..మొన్నీ మధ్య సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన బండ్ల గణేష్.. అప్పుడే రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. ఎంతలా అంటే తాను ఎంతగానో ద్వేషించి తిట్టిన చంద్రబాబునే పొగిడే అంత.. మొన్నటి నంది అవార్డులను ‘సైకిల్’ అవార్డులంటూ చంద్రబాబును బండ్ల గణేష్ ఏకిపారేశాడు. కానీ ఇప్పుడు మహాకూటమిలో చంద్రబాబు కలిసిరావడంతో అచ్చం కాంగ్రెస్ వాదిలా ఆయనను పొగిడేశాడు. అమెరికాలో, అమరావతిలో 60 ఏళ్లు వచ్చినా బాబు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నాడో చూడండి అంటూ కలరింగ్ ఇచ్చాడు. నాటి వ్యాఖ్యలు నేటి వ్యాఖ్యలు పూర్తి డిఫెరెంట్ గా ఉన్నాయి. కాంగ్రెస్ తోొ పొత్తు ఉండబట్టి ఇప్పుడు చంద్రబాబు దేవుడులా కనిపిస్తున్నాడు. ఒకవేళ ఇదే పొత్తు పొడవకపోయింటే ఖచ్చితంగా చంద్రబాబును బండ్ల ఏకిపారేసేవాడేమో.. రాజకీయాల్లో చేరి కొద్దిరోజులే అయినా బండ్ల గణేష్ అసలు సిసలు రాజకీయ నాయకుడిలా మారిపోయాడు.. అందునా కాంగ్రెస్ రాజకీయాలను బాగా ఒంటబట్టించుకొని మాట్లాడడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.