Begin typing your search above and press return to search.

అమెరికా ఓ ఆరిపోతున్న దీపం!

By:  Tupaki Desk   |   7 Oct 2016 6:09 AM GMT
అమెరికా ఓ ఆరిపోతున్న దీపం!
X
పొరుగు దేశం పాకిస్తాన్‌ కు ప‌రువు స‌మ‌స్య ఎదురైతోంది. అందని ద్రాక్షపండ్లు పుల్లన అన్నట్టుగా తయార‌వ‌డంతో పాకిస్తాన్ అవ‌స్త‌లు ప‌డుతోంది. కశ్మీర్‌ పై తనకు వంత పాడేందుకు అమెరికా తిరస్కరించడంతో భంగపడ్డ పాక్ ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యం ఎంతమాత్రం కాదని అంటున్నది. ఆరిపోతున్న దీపమని శాపనార్థాలు పెడుతున్నది. అంతటితో ఊరుకోకుండా అవసరమైతే రష్యా - చైనాలతో దోస్తీ కడతానని బీరాలు పలుకుతున్నది.

అమెరికా ఇక ఎంతమాత్రం ప్రపంచ శక్తి కాదు. దాని ప్రభ తగ్గిపోతున్నది. ఇక అమెరికాను మరచిపోదాం అని నవాజ్ షరీఫ్ కశ్మీర్ సమస్యపై ప్రపంచ దేశాలలో ప్రచారం నిర్వహించేందుకు నియమించిన ప్రత్యేకదూతల్లో ఒకరైన ముషాహిద్ హుసేన్ సయ్యద్ అన్నారు. కశ్మీర్‌ పై -ఇండియాపై తన వైఖరిని అమెరికా సమర్థించకపోవడమే ఈ చిర్రుబుర్రులకు కారణం. సయ్యద్‌ తో పాటుగా మరో దూత షాజ్రా మన్సబ్ కూడా ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. పలువురు అమెరికా నాయకులను - సంస్థలను కలుసుకొని పాక్ విధానాలను వివరిస్తున్నారు. అమెరికా ప్రముఖ అధ్యయన సంస్థల్లో ఒకటైన అట్లాంటిక్ కౌన్సిల్‌ తో సయ్యద్ సమావేశమయ్యారు. 90 నిమిషాల ఇష్టాగోష్టి సమావేశంలో ఆయన సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కశ్మీర్‌ పై తమ వైఖరికి మెరికాలో మద్దతు లభించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా పని అయిపోయిందని, ఇక రష్యా - చైనాలతో చెట్టపట్టాలు వేసుకొంటామని ఆయన చెప్పడం పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/