Begin typing your search above and press return to search.
భుట్టో హత్యపై ముషారఫ్ షాకింగ్ కామెంట్స్
By: Tupaki Desk | 22 Sep 2017 5:52 AM GMTకుట్రలు.. కుతంత్రాలు.. అంతర్గత కుమ్ములాటలకు మారుపేరు పాకిస్థాన్! అధికారంలో ఎవరు ఉన్నా.. వారిని దించేంత వరకూ కుట్రలు జరుగుతూనే ఉంటాయి! ఇక వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరైన ముషారఫ్.. అటు భారత్ పైనో లేక సొంత దేశ నేతలపైనే విమర్శలు గుప్పిస్తూ ఉంటారు! అంతేగాక అప్పుడప్పుడూ షాకింగ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు బెనజీర్ భుట్టో హత్య గురించి ఆయన చేసిన కామెంట్స్ ఈ కోవలోకే వస్తాయి! ఈ హత్య పాత్రలో తన ప్రమేయం ఉందని నిర్ధారించడంతో.. ఇప్పుడు తనతోపాటు ఇప్పుడు బెనజ్జీర్ భుట్టో భర్త.. జర్దారీ హస్తం కూడా ఉందంటూ ఆరోపణలు చేశారు!!
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు - నియంత పర్వేజ్ ముషార్రఫ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ పాకిస్థాన్ సహ చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీపై సంచలన ఆరోపణలు చేశారు. జర్దారీ భార్య బెనజీర్ భుట్టో హత్యలో జర్దారీకి కూడా భాగస్వామ్యం ఉందని, ఆమె హత్యకు అసిఫ్ అలీ జర్దారీ హస్తం ఉందన్నారు. ఆమె సోదరుడు ముర్తాజ భుట్టో చావుకు కూడా జర్దారీ కారణం అన్నా రు. రావల్పిండిలో 2007 డిసెంబర్ 27న బెనజీర్ భుట్టోపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో ఆమె మృత్యువాత పడ్డారు. అయితే, ఆగస్టు 31న యాంటీ టెర్రరిజం కోర్టు ముషార్రఫ్ పాత్ర కూడా ఈ హత్యలో ఉందంటూ ఆరోపించింది.
అదే సమయంలో సాక్ష్యాధారాలు లేవని ఓ ఐదుగురు నిందితులను విడిచిపెట్టింది. ఇక బెనజీర్ భుట్టో ప్రధానిగా ఉన్న సమయంలోనే ఆమె సోదరుడు ముర్తాజా 1996లో కరాచీలో హత్యకు గురయ్యారు. ఆ హత్య ఆమె ప్రభుత్వాన్ని పడగొ ట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ముషార్రఫ్ భుట్టో కుటుంబానికి సంబంధించి మాట్లాడుతూ `భుట్టో కుటుంబంలో జరిగిన దుర్ఘటనలన్నింటికి ఒక వ్యక్తే కారణం.. అదే జర్దారీ. బెనజీర్ భుట్టో, ఆమె సోదరుడు ముర్తాజా భుట్టో హత్యకు కారణం జర్దారీనే` అంటూ ఆయన భుట్టో జర్దారీ ముగ్గురు పిల్లలకు వీడియో ద్వారా ఈ సందేశం చెప్పారు.0 భార్య చనిపోయినా ఏమీ పట్టించుకోని జర్దారీ పదవీ కాలాన్ని మాత్రం ఐదేళ్లపాటు దర్జాగా అనుభవించారని ఆరోపించారు.