Begin typing your search above and press return to search.
పాకిస్తాన్ బండారాన్ని బయటపెట్టిన ముషారఫ్
By: Tupaki Desk | 15 Nov 2019 10:21 AM GMTసైన్యాధ్యక్షుడి గా ఉంటూ పాకిస్తాన్ లో ప్రభుత్వాన్ని కూలదోసి ఆ దేశాన్ని గుప్పిట పట్టి నియంతలా పాలించిన పర్వేజ్ ముషారఫ్ అంటే తెలియని వారు ఉండరు. ఈ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు తాజాగా అల్ ఖైతా ఉగ్రవాద సంస్థ అధినేత అయిన ఒసామా బిన్ లాడెన్ గురించి.. పాకిస్తాన్ లో ఉగ్రవాదం గురించి సంచలన నిజాలు చెప్పుకొచ్చాడు. ముషారఫ్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ బండారం బయటపింది.
తాజాగా ముషారఫ్ మాట్లాడుతూ.. అల్ ఖైదా ఉగ్రసంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్ మా హీరో అని.. ఉగ్రవాదులంతా పాకిస్తాన్ హీరోలంటూ ప్రశంసలు కురిపించాడు. 1979లో మతపరమైన ఉగ్రవాదాన్ని అప్ఘనిస్తాన్ లో పాకిస్తానే ప్రవేశ పెట్టిందని ముషారఫ్ చెప్పినట్టు తాజాగా పాక్ రాజకీయ నాయకుడు ఫర్ హతుల్లా బాబర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ముషారఫ్ మాట్లాడిన వీడియోను షేర్ చేసి సంచలనం సృష్టించాడు.
అప్ఘనిస్తాన్ లో ఉగ్రవాదులను ప్రవేశపెట్టి ఆ దేశం నుంచి సోవియట్ వారిని వెళ్లగొట్టామని ముషారఫ్ ఆ వీడియో లో తెలిపారు. ఇక భారత్ పైకి ఉగ్రవాదుల ను ఎగదోశామని ముషారప్ తెలిపారు. కశ్మీరీలకు ఉగ్రవాద శిక్షణ ఇచ్చి భారత ఆర్మీపైకి ముజాహిద్దీన్ లుగా పంపి రక్తపుటేరులు పారించామని తెలిపారు.
అయితే ముషారఫ్ మాట్లాడిన ఈ వీడియో ఎప్పటిదీ.? ఎప్పుడు మాట్లాడారన్నది మాత్రం క్లారిటీ లేదు. కానీ లాడెన్ గురించి పాక్ లో ఉగ్రవాదం.. భారత్ పై ఉగ్రకుట్ర సహా అన్ని విషయాలను ముషారఫ్ చెప్పడం తో పాకిస్తాన్ పరువు ప్రపంచ వ్యాప్తంగా పోయినట్టైంది. ఆ దేశం ఉగ్రవాద దేశం అని ప్రపంచానికి మరోసారి తెలిసివచ్చింది.