Begin typing your search above and press return to search.

అంగారకుడి మీద పుట్టగొడుగులా? నిజమెంత?

By:  Tupaki Desk   |   30 May 2021 10:30 AM GMT
అంగారకుడి మీద పుట్టగొడుగులా? నిజమెంత?
X
అంగారకుడి మీదకు నాసా ఉపగ్రహాలను పంపిన విషయం తెలిసిందే. అప్పటినుంచే అంగారకుడి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. అంగారక గ్రహం అంతర్భాగంలో సముద్రం ఉందని కొన్ని వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఛాయా చిత్రాలు కూడా బయటపడ్డాయి. ఇక తాజాగా అంగారక గ్రహం మీద పుట్టగొడుగులు (మష్రూమ్స్​) వంటి ఆకారాలు గమనించినట్టు శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఇవి పుట్టగొడుగులు కాదని.. అంగారకుడి మీద జీవం ఉండే అవకాశం లేదని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు.

అయితే అంగారకుడి మీద పుట్టగొడుగుల్లాంటి రూపాలను మాత్రం కనుగొన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు బయటకు వచ్చాయి. మార్స్​రోవర్​ ఈ ఛాయాచిత్రాలను తీసింది. అయితే ఇవి పుట్టగొడుగులు కావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వీటిపై పరిశోధకులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఇవి పుట్టగొడుగులు కాదని.. అసలు ఏ జీవరాశికి చెందినవి కావని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఛాయా చిత్రాల్లో పుట్టగొడుగుల ఆకారంలో కనిపిస్తున్నవి హేమాటైట్ కాంక్రీషన్లని, ఖనిజ హేమాటైట్‌కి సంబంధించిన చిన్న గోళాకారపు ముక్కలని శాస్త్రవేత్తలు అంటున్నారు.

హేమాటైట్ ఒక సాధారణ ఐరన్ ఆక్సైడ్ సమ్మేళనం. ఇది రాళ్ళ నేలలలో విస్తృతంగా కనిపిస్తుంది. వీటిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంగారకుడిపై జీవరాశి ఉందా? అన్న అంశంపై చాలా రోజులుగా పరిశోధనలు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడ పుట్టగొడుగులు లాంటి కొన్ని ఆకారాలు దర్శనమివ్వడం గమనార్హం. ఇవి అగ్నిపర్వతం విస్పోటనం వల్ల ఏర్పడ్డ ఆకారాలు అయ్యిండవచ్చని కూడా కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పూర్తి స్థాయిలో వాస్తవాలు వెళ్లడవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.