Begin typing your search above and press return to search.

సంగీత దర్శకుడి సిస్టర్‌ సందడి

By:  Tupaki Desk   |   26 Oct 2019 9:23 AM GMT
సంగీత దర్శకుడి సిస్టర్‌ సందడి
X
ఏఆర్‌ రహ్మాన్‌ మేనల్లుడిగా పరిచయం అయిన జీవీ ప్రకాష్‌ అతి తక్కువ సమయంలోనే.. అతి చిన్న వయసులోనే అత్యధిక సినిమాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సంగీత దర్శకుడిగా స్టార్‌ అనిపించుకున్న జీవీ ప్రకాష్‌ ఇప్పుడు హీరోగా వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు అయిదు సినిమాలు ఉన్నాయి. ఇంకా కొన్ని చర్చల దశలో ఉన్నాయి. హీరోగా వరుసగా చిత్రాలు చేస్తున్న జీవీ ప్రకాష్‌ సోదరి భవానీ శ్రీ కూడా హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.

నటనపై ఆసక్తితో భవానీ శ్రీ ఇప్పటికే విజయ్‌ సేతుపతి హీరోగా నటిస్తున్న ఒక చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. భవానీ శ్రీ నటిస్తున్న మొదటి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సమయంలోనే భవానీ రెండవ సినిమా ఆఫర్‌ కూడా దక్కించుకుంది. మొదటి సినిమా ఇంకా విడుదల కాకుండానే ఏకంగా స్టార్‌ హీరో ధనుష్‌ కు జోడీగా నటించే అవకాశం దక్కింది.

సుధ కొంగర దర్శకత్వంలో ధనుష్‌ ఒక చిత్రంలో నటించబోతున్నాడు. ఆ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌ గా భవానీ శ్రీకి ఛాన్స్‌ దక్కిందట. త్వరలోనే ఆమె షూటింగ్‌ లో కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్‌ లు మాత్రమే కాకుండా ఈమెకు ఇంకా పలు సినిమాల్లో కూడా నటించేందుకు ఆఫర్లు వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

జీవీ ప్రకాష్‌ హీరోగా దూసుకు పోతున్న ఈ సమయంలో ఆయన సోదరి కూడా హీరోయిన్‌ గా సందడి చేస్తుంది. అన్న చెల్లి హీరో హీరోయిన్స్‌ గా అదీ చాలా బిజీ స్టార్స్‌ గా ఉండటం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అది జీవి ప్రకాష్‌.. భవానీశ్రీ విషయంలో చూస్తున్నాం.