Begin typing your search above and press return to search.
ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంతో సరిపెట్టుకున్న మస్క్..!
By: Tupaki Desk | 14 Dec 2022 4:30 PM GMTటెస్లా.. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో నేటి ఉదయం దాకా నెంబర్ వన్ గా ఉన్నారు. న్యూయార్క్ టైమ్ ప్రకారంగా ఉదయం 10:20 గంటల సమయంలో మస్క్ సంపద 168.5 బిలియన్ డాలర్లుగా ఉండగా ప్రముఖ వ్యాపారవేత్త బెర్నార్డ్ సంపద 172.9 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో ప్రపంచ కుబేరుడి జాబితాలో బెర్నార్డ్ నెంబర్ వన్ గా నిలువగా మస్క్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక గత వారం ఫోర్బ్స్ 2022 సంవత్సరానికి సంబంధించిన అత్యధిక ధనవంతుల జాబితాను ప్రకటించింది. ఈ లిస్టులోనూ బెర్నార్డ్ తొలి స్థానంలో నిలువగా మస్క్ రెండో స్థానంలో నిలిచారు. అయితే ఈ జాబితాను ఫోర్బ్స్ ప్రకటించిన కొద్దిసేపటికే మస్క్ తన వ్యక్తిగత సంపదను పెంచుకొని తిరిగి మొదటి స్థానంలో నిలిచారు. అయితే మరోసారి అతడి వ్యక్తిగత ఆస్తుల విలువ తగ్గడంతో మస్క్ మళ్లీ రెండో స్థానానికి పడిపోయారు.
అయితే ఇతర ప్రపంచ కుబేరుల మాదిరిగా బెర్నార్డ్ సంపదలో పెరగడం గానీ తరగడం గానీ జరుగడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. వడ్డీ రేట్ల కారణంగా మార్క్ జుకర్ బర్గ్.. జెఫ్ బెజోస్.. లారీ పేజ్.. సెర్గీ బ్రిన్ సంపద తగ్గడంతో ఫోర్బ్స్ జాబితాలో బెర్నార్డ్ అనుహ్యంగా మొదటి స్థానానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే బెర్నార్డ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
బెర్నార్డ్ ఇకోలో పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతకాలంపాటు ప్రముఖ వ్యాపారవేత్త ఫెరెట్ సావినెల్ కుటుంబ వ్యాపారంలో పని చేశారు. అనంతరం అమెరికాకు మకాం మార్చిన బెర్నాల్డ్ 1981లో తండ్రికి వారసత్వంగా వచ్చిన స్థిరాస్థి రంగంలోకి అడుగు పెట్టారు. 1984లో మళ్లీ ఫ్రాన్స్ కు తిరిగొచ్చారు. ఈక్రమంలోనే దివాళాతీసిన బౌశాక్ సెయింట్ ఫ్రెరేస్ కంపెనీనీ కొనుగోలు చేశారు. క్రిస్టియన్ డయోర్ అనే బ్రాండ్ పేరిట ఫ్యాషన్ వస్తువులను విక్రయించేవారు.
ఇందులో వచ్చిన లాభాలను ఇతర గ్రూపుల్లో పెట్టుబడులు పెట్టేవారు. వాటిని సైతం ఎంవీఎంహెచ్లో పెట్టుబడులు పెట్టి అందులో వాటాలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం కంపెనీ ఛైర్మన్ గా బెర్నార్డ్ వ్యవహరిస్తున్నారు. ఎంవీహెచ్లోనే లాయిస్ విటన్.. మోయెట్ హెన్నెస్సీ విలీనం అయ్యారు. ఈ క్రమంలోనే ఎంవీహెచ్ ను ప్రపంచంలోనే విలాసవంతమైన వస్తువుల విక్రయాలకు మారుపేరుగా మార్చివేశారు.
ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా షాంపేన్.. వైన్.. స్పిరిట్.. ఫ్యాషన్, లెదర్.. చేతి గడియాలు వంటి 70 ఫ్యాషన్ బ్రాండ్లను విక్రయాలను చేపడుతోంది. ఈ కంపెనీనికి ప్రపంచవ్యాప్తంగా 5 వేల 500 స్టోర్లు ఉన్నారు. 73 ఏళ్ల వయస్సు కలిగిన బెర్నాల్డ్ తనకున్న అనుభవంతోనే మార్కెట్ ను అంచనా వేస్తూ సంపదను పెంచుకుంటూ పోయారు. బెర్నార్డ్ కు నలుగురు సంతానం కాగా వీరంతా కూడా ఎంవీఎంహెచ్ లో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.