Begin typing your search above and press return to search.

ఎలాన్ మస్క్.. ఇది కొనే బేరమేనా?

By:  Tupaki Desk   |   7 Jun 2022 3:17 AM GMT
ఎలాన్ మస్క్.. ఇది కొనే బేరమేనా?
X
ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానని ముందుకు వచ్చిన టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ యాజమాన్యానికి చుక్కలు చూపిస్తున్నాడు. ఆయన వ్యవహార శైలిని చూస్తున్నవారు ఇది కొనే బేరం కాదులే అంటూ మాట్లాడుకుంటున్నారు. 44 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.3.4౦ లక్షల కోట్లు)తో ట్విట్టర్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ముందు అన్ని నిబంధనలకు ఓకే అని చెప్పిన మస్క్ ఆ తర్వాత ఫీచేముడ్ అంటూ ఫ్లేటు ఫిరాయించాడు.

ట్విట్టరులో అసలు ఖాతాలు కంటే నకిలీ ఖాతాలు (20 శాతం), స్పామ్ ఖాతాలే ఎక్కువగా ఉన్నాయని వీటి సంఖ్య ఎంతో ముందు తేల్చాలని ఎలాన్ మస్కు పట్టుబడుతున్నారు. అలాగే మొత్తం ట్విట్టర్ అకౌంట్లలో యాక్టివ్ యూజర్ల సంఖ్య కూడా చాలా స్వల్పం (2.5 శాతం) అని మస్క్ చెబుతున్నారు. కాబట్టి ట్విట్టర్ లో స్పామ్ డేటా, ఫేక్ అకౌంట్ల గురించిన సమాచారం తనకు కావాలని అడుగుతున్నారు. అవీ ఇస్తేనే కొనుగోలు చేస్తానని.. లేదంటే ట్విట్టర్ అంటే వైదొలుగుతానని తేల్చిచెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌ యజమాన్యానికి మస్క్ లేఖ రాశారు.

ఇప్పుడే కాదు మార్చిలో కూడా ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ నుంచి తాను వైదొలుగుతున్నా అని మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఫేక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయో చెప్పడంతోపాటు వాటిని తొలగిస్తానే ట్విట్టర్ కొనుగోలు చేస్తామని ఎలాన్ మస్కు మొండికేశాడు.ఇప్పుడేమో డేటా గురించి అడుగుతున్నారు. మొత్తం ట్విట్టర్ డేటా ఇస్తేనే కొనుగోలు చేస్తానని ఎలాన్ మస్క్ పట్టుబడుతున్నారు.

మరోవైపు ట్విట్టర్ యాజమాన్యం సమాచారం ఇవ్వడం కుదరదని స్పష్టం చేస్తోంది. ఇది ట్విట్టర్ గోప్యతా నియమాలు, నిబంధనలకు విరుద్ధమని అంటోంది. అలాగే ఫేక్ అకౌంట్లపై చర్యలు తీసుకున్నా వినియోగదారులు రకరకాల కొత్త ఐడీలతో నకిలీ ఖాతాలు తెరుస్తూనే ఉంటారని వెల్లడించింది. ఎప్పటికప్పుడు ఫేక్ ఖాతాలను తొలగిస్తూనే ఉన్నామని.. ట్విట్టర్ అల్గారిథమ్, ఆటోమేటిక్ ప్రక్రియ ద్వారా నకిలీ ఖాతాలను ఏరివేస్తున్నామని వివరించింది. ట్విట్టర్ లో ఫేక్ ఖాతాలు కేవలం 5 శాతమేనని.. మస్క్ అంటున్నట్టు 20 శాతం లేవని చెబుతోంది.

కాగా ఇదంతా జరగడానికి ముందు ఎలాన్ మస్క్ త్వరలో ట్విట్టర్ బాధ్యతలు చూసుకుంటారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటు ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేశాక తమ భవిష్యత్ ఏమవుతుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

తన సంస్థలో ఉద్యోగ భద్రత లేదనుకునేవాళ్లు వెళ్లిపోయినా తనకేమీ అభ్యంతరం లేదని మస్క్ చెప్పడం వారిలో ఈ ఆందోళనను మరింత పెంచింది. మళ్లీ ఇంతలోనే ట్విట్టర్ ను కొనుగోలు చేయనని ఎలాన్ మస్కు బెదిరిస్తున్నారు. ఒకవేళ అంతా సవ్యంగా కొనసాగి మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేస్తే తమ భవిష్యత్ ఏంటీ అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమ ఉద్యోగాలకు భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.