Begin typing your search above and press return to search.

లక్షకు పైగా వీసాల్ని రద్దు చేశారా?

By:  Tupaki Desk   |   4 Feb 2017 4:27 AM GMT
లక్షకు పైగా వీసాల్ని రద్దు చేశారా?
X
అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో ఏడు ముస్లిం దేశాలకు చెందిన వారిని అమెరికాకు రాకుండా బ్యాన్ విధించటం ఒకటి. దీనిపై అమెరికా వ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ రంగాల ప్రముఖులు మొదలు సగటు అమెరికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ నిర్ణయం తీవ్రత ఎంతన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.

యెమన్ కు చెందిన ఇద్దరు సోదరులు డలస్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ట్రంప్ ఆదేశాల నేపథ్యంలో వారిని అమెరికాలోకి అనుమతించలేదు. ఎయిర్ పోర్ట్ నుంచే తిరిగి వారిని వెనక్కి పంపించేశారు. ఈ నేపథ్యంలో వారు కోర్టులో కేసు వేశారు. ఇథియోపియాకు చెందిన విమానంలో తిరిగి పంపించేసిన వారు కోర్టును ఆశ్రయించటమే కాదు.. ట్రంప్ నిర్ణయం అనంతరం లక్షకు పైగా వీసాల్ని అమెరికా రద్దు చేసిందని పేర్కొన్నారు.

యెమన్ సోదరుల కేసు పుణ్యమా అని ట్రంప్ ఆదేశాల ప్రభావం ఎంత పెద్దదిగా ఉందన్నవిషయం ప్రపంచానికి తెలిసేలా చేసింది. అంతేకాదు.. అమెరికా నుంచి భారత్ కు రావాలనుకున్న ప్రవాసీయులు ఇప్పుడు ప్రయాణానికి ఏ మాత్రం సిద్ధంగా లేకపోవటం గమనార్హం.ఏ కారణాన్నో చూపించి వీసాను నిరాకరిస్తే..మొదటికే మోసం వస్తుందన్న భయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏడు ముస్లిం దేశాల పౌరుల్ని అమెరికాలోకి రానివ్వకుండా ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. వాస్తవంగా చూస్తే.. ఈ నిర్ణయం అనంతరం పరిణామాల పుణ్యమా అని.. విదేశీయుల్ని అమెరికాలోకి అనుమతించే విషయంలో మార్పులు వచ్చినట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/