Begin typing your search above and press return to search.

యాప్ లో అమ్మకానికి ముస్లిం అమ్మాయిలు.. కేంద్రం సీరియస్

By:  Tupaki Desk   |   2 Jan 2022 10:30 AM GMT
యాప్ లో అమ్మకానికి ముస్లిం అమ్మాయిలు.. కేంద్రం సీరియస్
X
ఇంటర్నెట్ వచ్చాక విశృంఖలత్వం ఎక్కువైంది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అయితే మరీ దారుణంగా తయారయ్యాయి. వాటి కేంద్రంగా కొత్త తరహా వ్యాపారం మొదలైంది. తాజాగా ఓ యాప్ లో అమ్మాయిలనే అమ్మకానికి పెట్టిన దారుణం వెలుగుచూసింది. పలువురు ముస్లిం అమ్మాయిల ఫొటోలను అప్ లోడ్ చేసి వారికి రేటును నిర్ధారించి మరీ వేలం పాటకు ఉంచిన ఘనట సంచలనమైంది.

ఆన్ లైన్ ద్వారా వారి వేలం పాటలు నిర్వహిస్తున్నారంటూ పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. దీనిపై మూడు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనపై కేంద్రప్రభుత్వం సీరియస్ అయ్యింది. తీవ్రంగా స్పందించింది. కఠిన చర్యలు తీసుకుంది. గిట్ హబ్ యాప్ ను బ్లాక్ చేసింది.

బుల్లిబాయి, సిల్లీ డీల్స్ పేరుతో గిట్ హబ్ యాప్ లో వందల సంఖ్యలో ముస్లిం అమ్మాయిలు, మహిళల ఫొటోలు అప్ లోడ్ అయ్యాయి. ఇంతమొత్తంలో ధరను చెల్లించి వారిని సొంతం చేసుకోవచ్చనే ప్రకటనలు ఈ యాప్ లో కనిపించాయి.

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని శనివారం నాటి రాత్రి ఈ ఫొటోలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. వైరల్ అయ్యయి. ఇవి తమ దృష్టికి రావడంతో తొలుత ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో కేసులు నమోదయ్యాయి.

శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ ఉదంతంపై స్పందించారు. కేంద్రం ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయనను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఈ ఘటనపై కేంద్రప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. గిట్ హబ్ యాప్ ను బ్లాక్ చేసినట్లు ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ద్వారా ఈ యాప్ ను బ్లాక్ చేయించినట్లు చెప్పారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామన్నారు. ఢిల్లీ, యూపీ, మహారాష్ట్రల్లో దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిపారు. గిట్ హబ్ యాప్ నిర్వాహకులు, ఆ సంస్థ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చినట్లు తెలిపారు.

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన కొద్దిసేపటికే ‘బుల్ బాయ్, బుల్లిడీల్స్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.