Begin typing your search above and press return to search.
హిందూ మహిళా భక్తులకు ముస్లింల మద్దతు
By: Tupaki Desk | 27 Jan 2016 4:58 PM GMTమహారాష్ట్రలోని శని సింగనాపూర్ లో మహిళల ప్రవేశంపై నిషేధం... దాన్ని ఉల్లంఘిస్తామని... హెలికాప్టర్లలోంచైనా సరే ఆలయంలో దిగుతామని మహిళా సంఘాలు సవాల్ చేయడం నేపథ్యంలో ఈ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సాటి మహిళలన్న ఉద్దేశంతో స్పందించారో లేదంటే మతపరమైన దురుద్దేశాలున్నాయో అప్పుడే చెప్పలేం కానీ ఈ విషయంలో హిందూ మహిళలకు ముస్లిం మహిళలు సంఘీభావం ప్రకటించారు.
భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ సంస్థ దీనిపై స్పందించి పురుషాధిక్యతతో సాగే సంస్థల నిర్వహణలోని ఆలయాల్లో వివక్ష కొనసాగుతోందని ఆరోపించింది. శని సింగనాపూర్ ఆలయం గర్భగుడిలోకి హిందూ మహిళలను అనుమతించాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. దైవానికి పూజలు చేసే హక్కు కోసం ఎన్ని రకాల అడ్డంకులు సృష్టిస్తున్నా బెదరక ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను తెలియజేస్తున్న హిందూ మహిళా కార్యకర్తలను తాము అభినందిస్తున్నామని ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. సింగనాపూర్ ఆలయానికి వెళుతున్న మహిళలను నిలువరించడానికి పోలీసులు 144 సెక్షన్ ను అమలు చేయడం పట్ల తాము దిగ్భ్రాంతికి గురయ్యామని ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు జకియా సోమన్ - నూర్జహాన్ సఫియా నియాజ్ లు అన్నారు. పోలీసుల చర్యను వారు తీవ్రంగా విమర్శించారు.
అయితే మసీదులు, దర్గాల్లోనూ మహిళలకు ప్రవేశంపై ముస్లింవర్గాల్లోనూ భిన్న అభిప్రాయాలున్న నేపథ్యంలో ఈ ముస్లిం మహిళా ఆందోళన వాటిపై మాట్లాడకుండా శనిసింగనాపూర్ ఆలయ విషయంలో జోక్యం చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.