Begin typing your search above and press return to search.
వాళ్లకు రాముడు కలలోకి వచ్చారు..మతం మారారు!
By: Tupaki Desk | 3 Nov 2018 5:37 AM GMTభక్తరామదాసును చెర వేసిన తానీషాకు భద్రాద్రి రాముడు కలలోకి వచ్చిన వైనాన్ని ఇప్పటికి చెప్పుకుంటాం. తాజాగా ఒక ముస్లిం కుటుంబానికి గడిచిన 20 రోజులు రామచంద్రుడు కలలోకి వస్తున్నట్లుగా చెప్పారు. దీంతో.. వారు మతం మార్చుకొని హిందూమతాన్ని స్వీకరించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ పట్టణంలో చోటు చేసుకుంది. షహజాద్ అనే ముస్లిం వ్యక్తి తాను హిందూ మతంలోకి మారినట్లుగా మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన రాతపూర్వక స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. గడిచిన 20 రోజులుగా తన కలలోకి రాముడు వస్తున్నాడని.. తనను హిందూమతంలోకి మారాలని చెప్పినట్లుగా చెప్పారు.
తన పూర్వీకులంతా హిందువులేనని.. తర్వాతి కాలంలో కొందరి బలవంతంతో ముస్లిం మతంలోకి మారినట్లుగా పేర్కొన్నాడు. రాముడు కలలోకి వచ్చిన నేపథ్యంలో తాను హిందూమతంలోకి మారినట్లుగా చెప్పారు. హిందూ మతంలోకి మారటంలో ఎవరి ప్రమేయం లేదని.. తాను తన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నట్లు అతను పేర్కొన్నాడు.
తాను మతం మారటంపై తన మామతో పాటు కొందరు బెదిరిస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తనకు.. తన పిల్లలకు పోలీసు రక్షణ కల్పించాలన్నాడు. సంజూ రాణా మతం మారటం అన్నది అతడి వ్యక్తిగత నిర్ణయమని.. ఇందులో బెదిరించినట్లుగా తమకు ఆధారాలు ఏమీ లభించలేదని పోలీసులు చెబుతున్నారు. రాముడు కలలోకి కనిపించటంతో మతం మారిన ఫ్యామిలీ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.