Begin typing your search above and press return to search.
తలాక్ పై ఓవైసీ నిప్పు రాజేస్తున్నాడుగా
By: Tupaki Desk | 25 Dec 2017 8:53 AM GMTకేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ట్రిపుల్ తలాక్ (ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ) బిల్లు - 2017పై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కుంపట్లు రాజేస్తున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్ బీ)తో కలిసి ఓవైసీ ప్రత్యేకంగా - అత్యవసరంగా భేటీ అయ్యారు. మూడు సార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యను వదిలించుకునే విధానానికి బ్రేక్ వేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికై ఓవైసీ సహా ముస్లిం పెద్దలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు లక్నోలో అత్యవసర సమావేశం జరిపింది. ఇందులో అధ్యక్షుడు మౌలా నా రబే హసనీ నద్వి, ప్రధాన కార్యదర్శి మహ్మద్ వలీ రహ్మానీ - బోర్డు సభ్యుడు అయిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధికార ప్రతినిధి సజ్జద్ నోమానీ మాట్లాడుతూ బిల్లు రూపకల్పనలో సరైన విధానాన్ని పాటించలేదని - సంబంధిత వ్యక్తులు/ సంస్థలను సంప్రదించలేదన్నారు. దీన్ని ఏఐఎంపీఎల్ బీ అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లి...బిల్లును వెనుకకు తీసుకోవాలని కోరుతారన్నారు. మహిళలకు వ్యతిరేకమని, దాని అమలుతో చాలా కుటుంబాలు కూలిపోతాయని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్‌ను ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా వ్యతిరేకిస్తోందని.. ఈ మేరకు పటిష్ఠ చట్టం చేయాలని కోరుకుంటున్నామని బోర్డు కార్యదర్శి మౌలానా ఖలీద్ సైఫు ల్లా రహ్మానీ అన్నారు. అయితే తాజా కేంద్రం నిబంధనల్లో మార్పులు రావాలన్నారు.
ప్రస్తుత బిల్లుతో తాము సంతృప్తి చెందడం లేదని.. ముఖ్యంగా మూడేళ్ల జైలు నిబంధనతో విభేదిస్తున్నట్టు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యదర్శి చెప్పారు. `అప్పటికప్పుడు చెప్పే ట్రిపుల్ తలాక్ కు మేం వ్యతిరేకం. పటిష్ఠ చట్టం ఉండాలని కోరుకుంటున్నాం. సదరు చట్టాన్ని మత పెద్దలను సంప్రదించి రూపొందించాలి. ప్రస్తుత బిల్లు మహిళలకు వ్యతిరేకం. విడాకులిచ్చిన భర్త.. భార్య - పిల్లలకు మనోవర్తి ఇవ్వాలని కోర్టులు చెబుతున్నాయి. కానీ బిల్లులో మూడేళ్ల జైలు అనే అంశాన్ని చేర్చారు. ఈ రెండూ పరస్పర విరుద్ధం. భర్త జైలులో ఉన్నప్పుడు విడాకులు ఇచ్చిన భార్యకు ఎలా మనోవర్తి ఎలా ఇవ్వగలడు?` అని బోర్డు కార్యదర్శి రెహ్మానీ ప్రశ్నించారు.
కాగా బిల్లును రూపొందించే క్రమంలో ఏదైనా ముస్లిం సంస్థను సంప్రదించారా? అని ఇటీవల కేం ద్రాన్ని ప్రశ్నించగా సమాధానం వ్యతిరేకంగా వచ్చింది. ముస్లిం మహిళల హక్కుల రక్షణ అనేది లింగ సమానత్వంలోని మనవతా కోణానికి, మహిళల గౌరవానికి చెందిన అంశమని.. నమ్మకానికి - మతానికి సంబంధించిన అంశం కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.