Begin typing your search above and press return to search.
దీపావళి వేళ మోడీ అడ్డాలో రాముడికి ముస్లిం మహిళ హారతి
By: Tupaki Desk | 5 Nov 2021 4:03 AM GMTభిన్నత్వంలో ఏకత్వం అంటూ గొప్పగా చెప్పుకోవటమే కానీ అలాంటి పరిస్థితులు అంతకంతకూ తగ్గిపోతున్నాయన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. అలాంటి వాదన తప్పు అని చెప్పేలా కొన్ని ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతం కూడా ఈ కోవకు చెందిందే. గడిచిన పదిహేనేళ్లుగా సాగిస్తున్న సంప్రదాయాన్ని.. తాజాగా జరిగిన దీపావళి సందర్భంగా మరోసారి కొనసాగించి..ఇలాంటి విలక్షణత భారత్ కు మాత్రమే సొంతమన్నట్లుగా సాగింది.
ఉత్తరప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ముస్లిం మహిళ సంజీన్ అన్సారీ.. రాములోరికి హారతి పట్టారు. గడిచిన 15 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దీపావళి సందర్భంగా రాముడికి ఇచ్చే మహా హారతిలో నంజీన్ అన్సారీ స్వయంగా తన చేతులతో హారతి ఇస్తారు. స్వయంగా పాటలు పాడుతూ.. హారతి ఇస్తున్న ఆమెకు మరికొంతమంది మహిళలు సైతం జత కలవటం గమనార్హం.
ప్రతి ఏడాది రాముడి చిత్రపటానికి హారతి ఇచ్చే అన్సారీ.. తాజాగా మాత్రం ఈ ఏడాది తయారు చేయించిన విగ్రహాలకు ఆమె హారతి ఇచ్చారు. అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్న వేళ.. ఈ ఏడాది పూజలను అయోధ్య రాముడి పేరు మీద నిర్వహించటం చూస్తే.. ఇలాంటి విలక్షణత మరే దేశంలోనూ కనిపించదని చెప్పక తప్పదు.