Begin typing your search above and press return to search.
ట్రిఫుల్ తలాక్ వద్దంటూ ఓ మహిళ ఏం చేశారంటే
By: Tupaki Desk | 30 March 2017 4:39 AM GMTసంప్రదాయవాదుల నోట ఏదైనా మాట వస్తే చాలు.. లౌకికవాదులు చెలరేగిపోతుంటారు. తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. ఇదేం పద్ధతి అంటూ చాలానే మాటలు మాట్లాడుతుంటారు. పాత చింతకాయపచ్చడిలాంటి మూర్ఖపు ఆలోచనల్ని చెబుతారా? ఆధునికత అస్సలు ఉండదా? అంటూ విరుచుకుపడతారు. ఇలా అగ్గి ఫైర్ అయ్యే వారిలో వామపక్ష నేతలు..కాంగ్రెస్ నేతలు ముందుంటారు.
మరి.. ఇదే మాటలు ముస్లిం మైనార్టీల విషయంలో మాట్లాడేందుకు అస్సలు ఇష్టపడరు. ఓపక్క ముస్లిం మహిళలు..తమకు తాము వద్దంటే వద్దంటూగళం విప్పతున్న ట్రిపుల్ తలాక్ అంశంపై గళం విప్పేందుకు.. సంస్కరణలు తెచ్చేందుకు అస్సలు ఇష్టపడరు. డిజిటల్ యుగంలోనూ ట్రిపుల్ తలాకా? ముస్లిం దేశాలుగా ముద్ర పడిన పలు మతాన్ని అనుసరించే దేశాల్లోనూ ట్రిపుల్ తలాక్ పై బ్యాన్ విధిస్తే.. లౌకికవాదాన్ని విధిస్తూ.. మతం కంటే మానవ విలువలకే పట్టం కట్టే దేశంగా కబుర్లు చెప్పే మేధావులు పలువురు ట్రిఫుల్ తలాక్ విషయంలో మాత్రం నోరు మెదపటానికి ఇష్టపడరు.
అదేమంటే.. కొంతమంది ముస్లిం మేధావులు..అసలు ట్రిపుల్ తలాక్ గురించి తెలుసా? అందరూ అనుకునేటట్లు.. తలాక్..తలాక్ .. తలాక్ అంటూ మూడు సార్లు అన్నవెంటనే విడాకులు వచ్చేయవు.దానికి చాలానే ప్రాసెస్ ఉంటుందని చెబుతుంటారు. ఇలాంటి మాటలుచెప్పే వారంతా సింఫుల్ గా మర్చిపోయే విషయం ఏమిటంటే.. నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ దొడ్డిదోవన తమకు అనుకూలంగా వాటిని మార్చేయటం కానీ.. మారేలా జాగ్తత్తలు తీసుకోవటం ఉంటుందన్న విషయాన్నిమర్చిపోకూడదు.
ట్రిఫుల్ తలాక్ విషయంలోనూ ఇలాంటిదే వర్తిస్తుందన్న అసలు విషయాన్ని కావాలనే మర్చిపోతుంటారు. కఠినమైన ప్రాసెస్ ను అదే పనిగా వివరించే కంటే.. కోట్లాది ముస్లిం మహిళలు ఏమాత్రం ఇష్టపడని ట్రిపుల్ తలాక్ వద్దంటే వచ్చే నష్టం ఏమిటన్న దానిపై మాత్రం చాలామంది సూటిగా స్పందించరు. ముస్లిం మహిళలకు.. పురుషులకు మధ్య ట్రిఫుల్ తలాక్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఎంత ఎక్కువగా ఉన్నాయన్న విషయం ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
తాజాగా అలాంటి పరిణామమే ఒకటి చోటు చేసుకుంది. వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకిస్తూ ఒక ముస్లిం మహిళ.. ప్రధాని మోడీ.. యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ లకు ఒక లేఖ రాసింది. అబార్షన్ చేసుకునేందుకు నో చెప్పినందుకు తన భర్త తనకు తలాక్ ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. ట్రిఫుల్ తలాక్ ను రద్దు చేయాలని కోరింది.మరి.. ఇలాంటి బాధిత మహిళల ఆవేదనకు.. ట్రిఫుల్ తలాక్ ఉండాలని సమర్థించే మేధావులు ఏం సమాధానం చెబుతారు..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/