Begin typing your search above and press return to search.
బెంగుళూరు అల్లర్లు : హిందూ ఆలయాన్ని కూల్చకుండా అడ్డుకున్న ముస్లిం యువకులు
By: Tupaki Desk | 12 Aug 2020 3:30 PM GMTభారతదేశం .. భిన్నత్వం లో ఏకత్వం అనే నానుడికి ప్రతీక. ఏ మతానికి చెందిన వారైనా కూడా భారతదేశంలో స్వఛ్ఛగా జీవించవచ్చు. అలాగే దేశంలో కొన్ని కొన్ని సార్లు మత కలహాలు జరిగినప్పటికీ , మాట సామరస్యం ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా బెంగుళూరులో ఓ వైపు అల్లర్లు జరుగుతుంటే ..మరోవైపు మతసామరస్యం వెల్లివిరిసింది. తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితుల్లో కొందరు ముస్లిం యువకులు మత సామరస్యాన్ని చాటారు. డీజే హాళ్లి ప్రాంతంలోని ఒక హిందూ ఆలయానికి రక్షణగా నిలిచి , ఆలయం పై దాడి చేయకుండా అడ్డుకున్నారు. ఆందోళన కారులు ఆలయాన్ని నాశనం చేయకుండా ఆలయం చుట్టూ మానవహారంలా నిలబడ్డారు. కొన్ని గంటల సమయం పాటు అలాగే ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి అల్లుడు ఒక వర్గాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. మంగళవారం రాత్రి ఆందోళనకారులు ఆ ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. అక్కడ ఉన్న వందలాది వాహనాలకు నిప్పుపెట్టారు. ఎమ్మెల్యే ఇంటికి కూడా నిప్పుపెట్టారు. ఆందోళన కారులని ఆపటానికి పోలీసులు గన్ ఫైర్ చేయాల్సి వచ్చింది.ఆ కాల్పుల్లో ముగ్గురు మరణించడంతో ఆందోళన కారులు పోలిసుల పై రాళ్ల వర్షం కురిపించారు. ఆందోళన కారుల దాడుల్లో దాదాపుగా 60 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటన పై సీరియస్ అయిన ముఖ్యమంత్రి వెంటనే విచారణ జరిపి , చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశాలు జారీచేశారు.