Begin typing your search above and press return to search.

సొంతోళ్ల‌కు షియా వ‌క్ఫ్ బోర్డు ఛైర్మన్ షాక్‌

By:  Tupaki Desk   |   3 Feb 2018 10:14 AM GMT
సొంతోళ్ల‌కు షియా వ‌క్ఫ్ బోర్డు ఛైర్మన్ షాక్‌
X
ఇప్ప‌టికే ప‌లుమార్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ షియా వ‌క్ఫ్ బోర్డు ఛైర్మ‌న్ వ‌సీం రిజ్వీ మ‌రోసారి త‌న‌దైన శైలిలో షాకింగ్ వ్యాఖ్య‌లు చేశారు. అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణం మీద ఆయ‌న మాట్లాడినంత అనుకూలంగా మ‌రే మైనార్టీ నేత మాట్లాడ‌లేద‌ని చెప్పాలి. గ‌తంలో అయోధ్యలో రామాల‌య నిర్మాణం చేప‌ట్టాల‌ని.. అందుకు వ్య‌తిరేకించే వారిపై షాకింగ్ వ్యాఖ్య‌లు చేశారు.

అయోధ్య‌లో రామ‌మందిరం నిర్మాణాన్ని వ్య‌తిరేకించే ముస్లింలు పాకిస్థాన్.. బంగ్లాదేశ్ ల‌కు వెళ్లిపోవాల‌న్నారు. రామ జ‌న్మ‌భూమి పూజారి అచార్య స‌త్యేంద్ర దాస్ తో క‌లిసి రిజ్వీ ప్రార్థ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రామాల‌యం నిర్మాణాన్ని వ్య‌తిరేకించేవారు.. బాబ్రీ మ‌సీదు నిర్మించాల‌ని కోరుకునే వారు భార‌త‌దేశంలో ఉండే అర్హ‌త లేద‌న్నారు.

అలాంటి వారంతా పాకిస్థాన్ కో.. బంగ్లాదేశ్ కో వెళ్లిపోవాల‌ని సూచించారు. మ‌సీద్ పేరుతో జిహాద్ చేసేవారు.. ఐఎస్ ఐఎస్ చీఫ్ బ‌గ్దాదిని క‌లిసి ఆయ‌న ఉగ్ర‌వాద సంస్థ‌ల్లో చేరాల‌న్నారు. ఇదిలా ఉంటే.. రిజ్వీ వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు ముస్లిం నేత‌లు గుర్రుగా ఉండ‌టంతో పాటు.. ఆయ‌న వ్యాఖ్య‌ల కార‌ణంగా మ‌త క‌ల‌హాలు చెల‌రేగేలా ఉన్నాయంటూ మండిప‌డ‌టం గ‌మ‌నార్హం.