Begin typing your search above and press return to search.
ఓవైసీని ఓ రేంజ్ లో కెలికిన బీజేపీ ఎంపీ
By: Tupaki Desk | 7 Feb 2018 4:14 PM GMTఎంఐఎం అధినేత - ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సహజంగానే ముస్లింలకు మద్దతుగా మాట్లాడుతుంటారు. అదే సమయంలో ఇతర మతస్థులను రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేస్తారనే కొన్ని పార్టీల నేతలు ఆరోపిస్తుటారు. ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను ఇతర పార్టీల నేతలు పెద్దగా పట్టించుకోరు, స్పందించారు. కానీ...ఓవైసీ ఒక్క మాట అంటే..అంతకు రెండు మాట స్పందనతో...ఎంఐఎం అంటే విరుచుకుపడే బీజేపీ నేత ఒకరు స్పందించారు.
ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలతో పోటీ పడే రీతిలో వ్యవహరించే బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మోడీని కెలికారు. అయితే వివాదాస్పద - రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారతీయ ముస్లింలను ఎవరైనా పాకిస్థానీ అని పిలిస్తే వాళ్లకు కఠిన శిక్ష వేయాలని ఏఐఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మనదేశంలోని ముస్లింలను పాకిస్థాన్ గా పిలిచే వారిని శిక్షించేందుకు చట్టాన్ని తయారు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా ఆయన లోక్‌సభలో మంగళవారం మాట్లాడారు. భారత ముస్లింలను పాకిస్థాన్ గా పిలిచే వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం అలాంటి చట్టాన్ని చేయలేదని ఆయన విమర్శించారు. భారత్ లో నివసిస్తున్న ముస్లింలు.. మొహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించారని, అయినప్పటికీ భారతీయులు.. ముస్లింలను వేరుగా చూస్తున్నారని ఓవైసీ ఆరోపించారు.
దీనిపై కతియార్ తనదైన శైలిలో వివాదాస్పద రీతిలో స్పందించారు. ముస్లింలకు ఈ దేశంలో ఉండే హక్కు లేదని, వాళ్లంతా పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్ లకు వెళ్లిపోవాలని అన్నారు. వందేమాతరాన్ని గౌరవించనివాళ్లను, జాతీయ పతాకాన్ని అవమానించేవాళ్లను - పాకిస్థాన్ జెండాను ఎగరేసే వాళ్లను శిక్షించడానికి ఓ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అసలు ముస్లింల వల్లే మత ప్రాతిపదికన దేశ విభజన జరిగిందని కతియార్ విమర్శించారు. ఈ కామెంట్లపై ఓవైసీ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.