Begin typing your search above and press return to search.
బీజేపీకి ఓటేసే ముస్లింల మాటేమిటో..?
By: Tupaki Desk | 21 Dec 2016 7:03 AM GMTఅందరిని ఒకే గాటిన కట్టేయటం ఏ మాత్రం సరికాదు. సైద్దాంతికంగా ఉండే విభేదాలు ఉంటే మాత్రం నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటం ఏ మాత్రం సరికాదు. హిందుత్వ విధానాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందన్న భావన బీజేపీ మీద ఉందన్న విషయాన్ని కాదనలేం. బీజేపీని ముస్లింలు పూర్తిగా వ్యతిరేకిస్తారనుకోవటం తప్పులో కాలేసినట్లే. మతాన్ని ఆధారంగా చేసుకొని.. ఆ మతానికి చెందిన ప్రజలు తమకు అనుకూలమో.. వ్యతిరేకమోనన్న విషయాల్ని తేల్చేయటం సరికాదు.
బీజేపీని ముస్లింలు కొందరు వ్యతిరేకిస్తూ ఉండొచ్చు. అలా అని ముస్లింలు మోడీని అస్సలు అభిమానించరని చెప్పటం అన్యాయమే అవుతుంది. పలు రాష్ట్రాల్లో మోడీ పాల్గొనే సభల్లో ముస్లింలు పెద్దఎత్తున కనిపిస్తూ ఉంటారు. ఆ మాటకు వస్తే.. విదేశాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ముస్లింలు ప్రత్యేకంగా గ్రూపులు.. గ్రూపులుగా వస్తూ మోడీ మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.
అలాంటి విషయాల్ని మర్చిపోయి నోటికి వచ్చినట్లుగా మాట్లాడారో బీజేపీ ఎంపీ. ఫలానా మతానికి చెందిన వారు తమ పార్టీకి వ్యతిరేకంగా చెప్పుకునే బదులు.. ఆ మతస్తులు సైతం తమను అనుసరించేలా వారి మనసుల్ని దోచుకునేలా నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి.. వారికితమకు అస్సలు పడదన్నట్లుగా విపరీత వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం సమంజసం కానే కాదు. ఒకవేళ అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడుతుంటే.. వారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రధాని మోడీపై ఉంది.
తాజాగా బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా ఉండటమే కాదు.. ఇలాంటి వారి కారణంగా మోడీ ఇమేజ్ డ్యామేజ్ కావటం ఖాయమని చెప్పక తప్పుదు. ముస్లింలపై తీవ్రవ్యాఖ్యలు చేసిన సదరు బీజేపీ ఎంపీ మాటల్ని ఆ పార్టీ ఖండించటమే కాదు.. అలాంటి వారి నోటికి తాళాలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇంతకీ ఆయనేం అన్నారు? ఎంతలా నోరు పారేసుకున్నారన్నది చూస్తే.. ‘‘ఎందుకుఉగ్రవాదులంతా ముస్లింలే అవుతున్నారు? ఎందుకు ముస్లింలు బీజేపీకి ఓటువేయరు? ఎందుకంటే మాది దేశభక్తుల పార్టీ. ఈ కారణంగానే ముస్లింలు బీజేపీకిఎన్నడూ ఓటు వేయలేదు. వేయబోరు కూడా. పైగా మేం ఎన్నడూ ఓటు బ్యాంకుగురించి పట్టించుకోలేదు. ప్రధాన స్రవంతిలోకి రావాలని.. అభివృద్ధి క్రమంలోభాగస్వాములు కావాలనీ వారికి లేదు. అసలు సమస్య భారత్-పాక్‌సంబంధాలతో ముడిపడి ఉంది. ఉగ్రవాదులకు ఆయుధాలు, నిధులు ఏ దేశంనుంచి అందుతున్నాయనేది చూడాల్సి ఉంది’’ అని చెప్పిన తీరు చూస్తే.. ఇలాంటి వారి కారణంగా బీజేపీ లాభం కంటే నష్టమే ఎక్కువన్నది నిజం. ముస్లింలు బీజేపీకి ఎన్నడూ ఓటు వేయలేదు అనటమే కాదు.. వేయబోరు కూడా అని చెప్పటం ద్వారా.. ముస్లింలను సదరు ఎంపీ దారుణంగా అవమానించారన్నది మర్చిపోకూడదు. ఇలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే తమ పార్టీ ఎంపీపై మోడీ ఎలాంటి తాళం వేస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/