Begin typing your search above and press return to search.
అసద్ మీద ఆగ్రహంతో రక్తం చిందించిన ముస్లిం
By: Tupaki Desk | 21 March 2016 9:51 AM GMTపనికిమాలిన మాటలు మాట్లాడటం.. అనవసరమైన భావోద్వేగాల్ని రెచ్చగొట్టటం ఈ మధ్యన కొందరు రాజకీయ నాయకులకు ఒక అలవాటుగా మారింది. వీరి వైఖరి కారణంగ దేశంలో భావోద్వేగాలు ప్రభావితం కావటమే కాదు.. పలు నిరసనలకు కారణమవుతోంది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంగతే తీసుకుంటే.. ఆ మధ్యన మహారాష్ట్రలోని ఒక సభలో పాల్గొన్న ఆయన.. తన గొంతు మీద కత్తి పెట్టినా ‘‘భారత్ మాతా కీ జై’’ అనే మాట అననంటూ తేల్చి చెప్పటం తెలిసిందే.
అసద్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా రచ్చ రేగటమే కాదు.. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే.. తాను చేసిన చెత్త వ్యాఖ్య మీద దేశ వ్యాప్తంగా రేగుతున్న నిరసనల్ని లైట్ తీసుకోవటమే కాదు.. ముస్లిం అనే వాడు మతానికి తప్ప దేశానికి సలాం చేయడంటూ మరిన్ని చెత్త మాటలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇతని వ్యాఖ్యల్ని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె కూడా ఖండించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. శనివారం కోల్ కతాలో జరిగిన భారత్.. పాక్ టీ20 మ్యాచ్ లోకు హాజరైన వేలాది మంది ప్రేక్షకులు ‘‘భారత్ మాతాకీ జై’’ అనటం ద్వారా అసద్ కు కౌంటర్ చెప్పే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉంటే.. అసద్ మాటలకు మిగిలిన వారి కౌంటర్ ఎలా ఉన్నా.. తాజాగా ఒక ముస్లిం చేసిన పని చర్చనీయాంశంగా మారింది. మీరట్ కు చెందిన మహ్మమద్ ఇమామ్ అనే వ్యక్తి ఇండియా మ్యాప్ మీద రక్తంతో భారత్ మాతాకీ జై అంటూ నినాదాల్ని రాయటం విశేషం. రాజకీయ ప్రయోజనాల కోసమే అసద్ అలాంటి వ్యాఖ్యలు చేశారని.. భారత అనుకూల నినాదాలు చేయకూడదని ఇస్లాం చెప్పలేదని వ్యాఖ్యానించిన ఆయన.. అసద్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాడు.
భారత్ మాతాకీ జై అనటమంటే.. ఉన్న భూమిని.. మహిళలకు.. దేశాన్ని కాపాడుతున్న సైనికులకు జైజేలు పలకటమేనని.. అసద్ మాటలు ఎంతమాత్రం ఆమోద యోగ్యమైనవి కావని తేల్చాడు. అంబేడ్కర్ ఏం చెప్పారు ఓవైసీ ? అని ప్రశ్నిస్తున్న ఈ ముస్లిం.. సిరంజి సాయంతో తన మణికట్టు నుంచి రక్తాన్ని తీసి భారతమాతకు జై కొట్టారు. అసద్ వ్యాఖ్యల్ని ఖండించేందుకు ఒక అసలుసిసలు ముస్లిం రక్తం చిందించేలా చేసిన వైనానికి ఆయన స్పందిస్తారా? అంత ధైర్యం ఆయనకు ఉందా..?