Begin typing your search above and press return to search.
కర్ణాటకలో ఎన్నికలొస్తాయి.. నిఖిల్ సంచలనం
By: Tupaki Desk | 7 Jun 2019 8:57 AM GMTమొన్నటి పార్లమెంట్ ఎన్నికలతో కర్ణాటకలో అధికార జేడీఎస్ కథ కంచికి చేరింది. కాంగ్రెస్ తో కలిసి మొన్నటి ఎన్నికల్లో పోటీచేసిన జేడీఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. సీఎం కుమారస్వామి తన కొడుకు అయిన నిఖిల్ ను - తండ్రి అయిన దేవెగౌడను కూడా గెలిపించుకోలేకపోయారు. బీజేపీ హోరు గాలిలో జేడీఎస్ కొట్టుకుపోయింది.
కర్ణాటకలో మొత్తం 28 పార్లమెంట్ సీట్లకు గాను 25 స్థానాలను గెలుచుకొని బీజేపీ సత్తా చాటింది. ఇక సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్. మాండ్యాలో ఇండిపెండెంట్ అభ్యర్థి సుమలత చేతిలో దారుణంగా ఓడిపోయాడు. తొలి ఎన్నికల పోరులోనే నిఖిల్ ఓడిపోవడంతో నిరాశలో కూరుకుపోయాడు. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలు జేడీఎస్ కు పీడకలను మిగిల్చాయి.
దీంతో నిరాశలో కూరుకుపోయిన జేడీఎస్ శ్రేణులతో తాజాగా నిఖిల్ కుమారస్వామి భేటి అయినట్టు సమాచారం. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశాడట.. జేడీఎస్ ఓడిపోవడంతో రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని.. సిద్ధంగా ఉండాలని..ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాలని పార్టీ శ్రేణులకు నిఖిల్ పిలుపునిచ్చారు. ఏడాదిలోపే ఎన్నికలు వస్తాయని నిఖిల్ మాట్లాడిన వీడియో ఇప్పుడు కర్ణాటకలో వైరల్ గా మారింది..
ఈ వీడియోను సునీల్ గౌడ అనే కార్యకర్త వాట్సాప్ లో షేర్ చేయడంతో సంచలనంగా మారింది. త్వరలోనే ఎన్నికలకు సిద్ధం కావాలని పేర్కొనడంతో కన్నడలో జేడీఎస్ ప్రభుత్వం వైదొలుగుతుందా.? లేక కూలిపోతుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.