Begin typing your search above and press return to search.

జిహాదీలు - మావోయిస్టులు..అల్లర్లపై నోరుజారిన నిర్మల

By:  Tupaki Desk   |   16 Dec 2019 12:09 PM GMT
జిహాదీలు - మావోయిస్టులు..అల్లర్లపై నోరుజారిన నిర్మల
X
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్న క్రమంలో దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ హింసాత్మక ఘటనల వెనుక జిహాదీలు, మావోయిస్టులు, వేర్పాటువాదుల హస్తం ఉందని ఆమె ఆడిపోసుకున్నారు. విద్యార్థుల ముసుగులో అసాంఘిక శక్తులు, అరాచకవాదులు హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు, కార్యక్రమాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల హెచ్చరించారు.

ఢిల్లీ వేదికగా ఉన్న జామియా ముస్లిం యూనివర్సిటీ విద్యార్థుల వెనుక జిహాదీలు ఉన్నారని.. విద్యార్థులెవరూ ఇంత భారీ ఎత్తున హింసాత్మక చర్యలకు దిగకపోవచ్చని నిర్మల హాట్ కామెంట్స్ చేశారు. కొంత మంది అరాచక వాదులు విద్యార్థుల ముసుగులో ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వీరిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని నిర్మలా చెప్పారు.

ఢిల్లీ లోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఈ నిరసన హింసాత్మకంగా మారింది. అదుపు తప్పింది. బస్సులు , ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో నిర్మల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. నిర్మల వ్యాఖ్యలపై విద్యార్థులు, నిరసనకారులు భగ్గుమంటున్నారు.