Begin typing your search above and press return to search.
దావుద్ గ్యాంగ్ జల్సాలు చూస్తే షాకే!
By: Tupaki Desk | 3 Jan 2017 5:11 AM GMTపోలీసులు తలుచుకుంటే ఏమైనా చేస్తారనటానికి ఈ ఉదంతం నిలువెత్తు నిదర్శనంగా చెప్పాలి. తీవ్రమైన కేసులో నిందితుడి అవసరాల్ని తీర్చేలా పోలీసులు ఎంతగా ప్లాన్ చేస్తారో ఈ కథనాన్ని చదివితే ఇట్టే అర్థమవుతుంది. 1993 ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడైన ముస్తఫా దోస్సా తాజా యవ్వారం సంచలనంగా మారింది. ప్రస్తుతం ముంబయిలోని జైల్లో ఉన్న అతడ్నిపేలుళ్ల కోసం ఉపయోగించిన మందు సామాగ్రిని ఎక్కడ నుంచి సేకరించారన్న విషయంపై విచారణ చేసేందుకు వీలుగా పోలీసులు ఒక ట్రిప్ ఏర్పాటు చేశారు.
ముంబయి నుంచి పోర్ బందర్ కు విచారణ కోసం ముస్తఫాను తరలిస్తున్నట్లు పోలీసులు చెప్పినప్పటికీ వాస్తవం మాత్రం మరోలా ఉందన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. ముంబయిలో ట్రైన్ బయలుదేరిన తర్వాత ముస్తఫా సతీమణి షబీనా ఖత్రీ అహ్మదాబాద్ లోని ట్రైన్ ఆగినప్పుడు.. ఆ ట్రైన్లో ఎక్కటమేకాదు.. భర్తతో కలిసి ప్రయాణించిందని చెబుతున్నారు.
ఈ సందర్భంగా తీసుకున్న ఫోటో ఒకటి బయటకు రావటం.. ఆ టైంలో పోలీసులు వారి పక్కనే ఉన్నట్లు చెబుతున్నారు. పేలుళ్ల కేసు విషయానికి సంబంధించిన అంశాలపై దర్యాప్తు కోసం ట్రైన్లో వెళుతున్నట్లు చెప్పినప్పటికీ.. బిజినెస్ డీల్ కు సంబంధించిన అంశంపై చర్చలు జరపటంతో పాటు.. ట్రైన్లో భార్యతో ఎంజాయ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరు ప్రయాణించిన సౌరాష్ట్ర ఎక్స్ ప్రెస్ అహ్మదాబాద్ స్టేషన్ కు చేరుకున్న వెంటనే.. ముస్తఫా సతీమణి ట్రైన్లో ఎక్కారని.. ఆమె వచ్చిన తర్వాత పోలీసులు వారు ప్రయాణిస్తున్న బోగీలో దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ట్రైన్ పోర్ బందర్ వెళ్లిన తర్వాత మాత్రమే పోలీసులు ముస్తఫా వద్దకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. గతంలోనూ పేలుళ్ల నిందితుడైన అబూ సలేం కూడా ఇదే తీరులో తన భార్యతో ట్రైన్లో గడపటాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/