Begin typing your search above and press return to search.
టీటీడీపీ ఇక ఖాళీనే .. బీజేపీలోకి మోత్కుపల్లి
By: Tupaki Desk | 5 Nov 2019 5:10 AM GMTఓడలు బండ్లు కావడం ..బండ్లు ఓడలు కావడం కేవలం రాజకీయాలలో మాత్రమే సాధ్యం అవుతుంది. అప్పటివరకు ఆ పార్టీ అధినేత పై అదారుణమైన విమర్శలు చేసినవారే ఆ తరువాత కొన్ని రోజులకి అదే అధినేతకు జై కొట్టి పార్టీలో చేరిపోతారు. అదేమిటి అంటే మా నియోజవర్గం అభివృద్ధి కోసం , అయన పాలన బాగుంది కాబట్టి చేరుతున్నాం అంటారు. మళ్ళీ ఎన్నికల సమయానికి అదే పార్టీలో ఉంటారో ఉండరో కూడా తెలియదు. అందుకే రోజు రోజుకి ప్రజాప్రతినిధులపై ప్రజలకి నమ్మకం తగ్గిపోతుంది. అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో కూడా కొంతమందికి తెలియడంలేదు. స్కూల్ పిల్లలైనా ఒకే స్కూల్ లో చదువుతారేమో కానీ , రాజకీయ నేతలు మాత్రం ఒకే పార్టీ లో చివరి ఉండటం ప్రస్తుత రోజుల్లో అసాధ్యం. ఆలా ఉండాలని ప్రజలు కోరుకోవడం కూడా అత్యాశే అవుతుంది.
ఇకపోతే తెలంగాణలో వలసల రాజకీయ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణ లో తెరాస కి గట్టి పోటీనిస్తున్న పార్టీ అంటే బీజేపీ అని చెప్పాలి. కాంగ్రెస్ లో ఉన్న కీలక నేతలు వారి పదవుల కోసం పోట్లాడటానికే సమయం సరిపోలేదు. దీనితో త్వరలో కాంగ్రెస్ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా పెద్దగా ఆశ్చర్యం లేదు. ఇక మూసేయడానికి సిద్ధంగా ఉన్న మరో పార్టీ టీడీపీ ... రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ లో టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. అసలు మొన్న జరిగిన హుజూర్ నగర్ బై పోల్ లో ఇండిపెండెంట్ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి అంటే టీడీపీ ఎటువంటి పరిస్థితిలో ఉందొ చెప్పవచ్చు. దీనితో టీటీడీపీ నేతలు ఒక్కొక్కరిగా బీజేపీలోకి చేరిపోతున్నారు.
ఇదే క్రమంలో తాజాగా టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి బీజేపీలో చేరబోతున్నారు. టీడీపీలో కీలక నేతగా ఎదిగిన మోత్కుపల్లి చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరతారంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు. తాజాగా అయన బీజేపీలోకి చేరిపోయారు. బీజేపీలో చేరే విషయమై ముందుగా అమిత్ షాతో మాట్లాడాలన్న యోచన మేరకు రాష్ట్ర నేతల ఆధ్వర్యంలో ఆయనతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో మోత్కుపల్లి అధికారికంగా ఆ పార్టీలో చేరనున్నారు.