Begin typing your search above and press return to search.
పవన్ ప్లాన్ బి టీడీపీని వణికించేస్తోందిగా!
By: Tupaki Desk | 7 Aug 2018 8:19 AM GMTజనసేన పార్టీ అధినేత - సినీనటుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా వేస్తున్న వ్యూహాత్మక అడుగులు తెలుగుదేశం పార్టీని కలవరపాటుకు గురిచేస్తున్నాయని అంటున్నారు. నాలుగేళ్ల పాటు టీడీపీతో దోస్తీ కొనసాగించిన పవన్ అనూహ్యంగా పచ్చపార్టీకి బైబై చెప్పి టీడీపీ పాలన అవినీతిమయం అంటూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు దన్నుగా ఉండే కొన్ని మీడియా సంస్థలు పవన్‌ఫై ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. ఈ నేపథ్యంలో మీడియా ప్రాధాన్యతను గుర్తించిన పవన్ ...తన కోటరీలోనూ ప్రసార మాధ్యమాలు ఉండేలా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది.
కాకినాడకు చెందిన మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణ ఆంధ్రప్రభ పేరుతో ఓ దినపత్రికను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు గౌతమ్ ఇటీవల జాతీయ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. గౌతమ్ ఆధ్వర్యంలో ఇండియా అహేడ్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ప్రారంభం అయింది. ఈ చానల్ తరఫున పవన్‌కు ప్రచారం కల్పించేందుకు వారు సిద్ధమయ్యారు. ఆదివారం మాదాపూర్ లోని జనసేన కార్యాలయాన్ని ముత్తా తన కుమారులతో సందర్శించి పవన్ తో భేటీ అయ్యారు. లో ఒక కార్యక్రమాన్ని శ్రీ పవన్ కల్యాణ్ హోస్ట్ గా రూపకల్పన చేశామని - ఆ కార్యక్రమంలో చేయడానికి అంగీకరించాల్సిందిగా వారు పవన్ కల్యాణ్ ను కోరారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే ఈ టీవీ షోను చేయడానికి పవన్ కల్యాణ్ అంగీకారం తెలిపారని జనసేన తెలిపింది. అదే విధంగా ముత్తా గోపాల కృష్ణ జనసేనలోకి రావాల్సిందిగా పనన్ కల్యాణ్ చేసిన కోరగా అందుకు ఆయన సమ్మతించారు. ముత్తా గోపాలకృష్ణ అనుభవం జనసేనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జనసేన అధినేత అభిప్రాయపడ్డారు. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ముత్తా గోపాలకృష్ణకు స్థానం కల్పిస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆయన తన పెద్ద కుమారుడు శ్రీ శశిధర్ తో కలిసి కొద్ది రోజుల్లోపార్టీలో చేరనున్నారు. దీంతో తెలుగులో ఓ ప్రధాన పత్రిక - జాతీయ మీడియాలో ఓ కీలక టీవీ చానల్ పవన్‌కు అండగా నిలిచేందుకు సిద్దమైనట్లే.
మరోవైపు ఇప్పటికే పవన్ పార్టీకి చెందిన తోట చంద్రశేఖర్ 99 టీవీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆ మీడియా సరైన కొనుగోలుదారుల కోసం వెతుకుతున్న సమయంలో చంద్రశేఖర్ ఆ చానల్ ను కైవసం చేసుకున్నారు. ఇప్పటికే ఆయనకు ఓ యూట్యూబ్ చానల్ కూడా ఉంది. దీంతో ఇటు డిజిటల్ మీడియాలో - అటు ఎలక్ట్రానిక్ మీడియాలో పవన్ కు గట్టి మద్దతుదారు దొరికినట్లయింది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మద్దతుగా ఇప్పటికే పలు చానల్లు - పేపర్లు వ్యవహరిస్తున్నాయనేది బహిరంగ రహస్యం. మరోవైపు ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్ - తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా సొంత మీడియాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ సైతం ఈ మీడియా గోదాలోకి దిగి...పరోక్షంగా తన సత్తాను చాటుకునేందుకు రెడీ అయ్యారని పలువురు పేర్కొంటున్నారు.