Begin typing your search above and press return to search.
ముత్తిరెడ్డి.. ఎంత పెద్ద ముదురుకేసంటే?
By: Tupaki Desk | 13 Aug 2018 12:30 PM GMTఒక రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నా.. కొందరి పేర్లు మాత్రం రాష్ట్రంలోని ప్రజలందరికి సుపరిచితులుగా ఉంటారు. తమ తీరుతో వారు తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో వివాదాల్లో తరచూ కనిపించే ఎమ్మెల్యేల్లో ఒకరు జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.
తప్పు చేసినోడు కొడుకైనా.. కూతురైనా చట్టబద్ధంగా చిక్కులు తప్పవన్న హెచ్చరిక చేసిన ముఖ్యమంత్రి సహనానికే పరీక్ష పెట్టటంలో ముత్తిరెడ్డి మొనగాడిగా చెబుతారు. అతగాడి భూకబ్జాల బాగోతాన్నిజనగామ కలెక్టర్ దేవసేన బహిరంగంగానే ఆరోపణలు చేయటం టీఆర్ఎస్ సర్కారును ఇబ్బందికి గురి చేసేలా చేసింది.
ఇదిలా ఉంటే.. ముత్తిరెడ్డి గురించి మొదట్నించి అవగాహన ఉన్న వారికి ఆయనపై వచ్చే విమర్శలు.. ఆరోపణల్ని పెద్దగా పట్టించుకోరు. వివాదాల చుట్టూనే తిరుగుతుంటారని.. అలాంటి ఆయన వివాదాలకు దూరంగా ఉంటేనే విషయంగా కొందరు చెబుతారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడక ముందు నుంచి ముత్తిరెడ్డి వ్యవహారం సాగుతూనే ఉందని చెబుతారు.
దాదాప 17 ఏళ్ల కిందట హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కిడ్నాప్.. భూకబ్జాలు.. ఫోర్జరీ.. మోసం లాంటి నేరాలపై కేసులు నమోదైనట్లుగా చెబుతారు. అప్పట్లో 73 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడు మందాడి రామచంద్రారెడ్డిని కిడ్నాప్ చేసి చంపుతనని బెదిరించి ఆయనకు చెందిన 4.8 ఎకరాల భూమిని తన పేరు మీద రాయించుకున్నట్లుగా చెబుతారు. దీనికి సంబంధించిన కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఎఫ్ ఐఆర్ నెంబరు 1285/2002గా చెబుతారు
.
అంతేకాదు.. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో రవిబాబు అనే వ్యక్తికి చెందిన 26.2 ఎకరాల భూమిని బలవంతంగా ఆక్రమించుకున్నట్లుగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అందింది. దీనిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ ఐఆర్ నెంబర్ 35/2000గా చెబుతారు. ఇదే గ్రామానికి చెందిన మరో సర్వే నంబర్ లో సురేశ్ అనే వ్యక్తికి చెందిన 5.18 ఎకరాల భూమిని కూడా ముత్తిరెడ్డి మరో ఇద్దరు కలిసి కబ్జాకు పాల్పడినట్లుగా చెబుతారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ 38/2000గా చెబుతారు.
ఈ కబ్జాల కథ ఇలా ఉండగా.. బేగంపేటకు చెందిన దామోదర్ దాసు అనే బిజినెస్ మ్యాన్ కు చెందిన భూమిని కూడా భూకబ్జాకు ప్రయత్నించినట్లుగా ముత్తిరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. దీనికి సంబంధించిన ఎఫ్ ఐఆర్ నెంబరు 43/2000గా చెబుతారు. మరిన్ని కేసులు నమోదైన తర్వాత కూడా ఆయన పోలీసుల అదుపులోకి ఎందుకు వెళ్లనట్లు? అంటే.. అదే ముత్తిరెడ్డి అంటే.
తనపై ఫిర్యాదు చేసి కేసులు నమోదు కావటానికి కారణమైన వారితోనే రాజీ రాయబారాన్ని నడపటమే కాదు.. తాము కేసుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా కోర్టులకు చెబుతూ ఫిర్యాదుదారులు వెనక్కి తగ్గటం గమనార్హం. కేసుల రాజీల వెనుక ముత్తిరెడ్డి ఒత్తిడి ఒక రేంజ్లో ఉంటుందని చెబుతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ముత్తిరెడ్డికి చెందిన భూమిగా చెప్పేది ఉస్మానియా వర్సిటీకి చెందిన స్థలాన్ని ఆక్రమించుకొని హోటల్ నిర్మించినట్లుగా విద్యార్థులు ఆరోపించి.. ధర్నా చేశారు. ఇదే కాదు.. నాచారం మల్లాపూర్ లో ముత్తిరెడ్డికి చెందిన ఫంక్షన్ హాల్ కూడా ఆక్రమించుకొని నిర్మించిందనేనని చెబుతారు. ఇలాంటి హిస్టరీ ఉన్న ముత్తిరెడ్డి.. .ఒక ల్యాండ్ ఇష్యూలో రాత్రివేళ మహిళా అధికారి ఇంటికి వెళ్లి పని ఎందుకు ఆలస్యమవుతుందని అడగటాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
తెలుగు సినిమాల్లో కనిపించే పాత్రకు దగ్గరగా ఆయన తీరు ఉంటుందన్న పేరు ఉంది. ఆయన కంట పడిన భూమి ఏదైనా సరే.. ఆయన సొంతం కావాలని చెబుతారు. కేసీఆర్ లాంటి నాయకుడి నాయకత్వంలోని పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇన్ని వివాదాల్లో చిక్కుకోవటం ముత్తిరెడ్డి స్పెషల్ గా చెబుతారు.