Begin typing your search above and press return to search.

దెయ్యాల కొంప మ‌రక మీడియా మీద ప‌డేశారుగా

By:  Tupaki Desk   |   26 May 2017 3:15 PM GMT
దెయ్యాల కొంప మ‌రక మీడియా మీద ప‌డేశారుగా
X
ఇష్టారాజ్యంగా మాట్లాడేయ‌టం రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటే. అయితే.. త‌మ త‌ప్పును క‌ప్పి పుచ్చుకునేందుకు వారు ఎంత‌కైనా సిద్ధ‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. టెక్నాల‌జీ పెరిగిపోయి.. నేత‌ల నోటి నుంచి ప్ర‌తి మాట రికార్డు అవుతున్న వేళ సైతం.. తాము సుద్ద‌పూస‌లమ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం విశేషం. చేసిన త‌ప్పును చెంప‌లేసుకుంటే అయిపోయే దానికి భిన్నంగా.. త‌మ త‌ప్పుడు మాట‌ల్ని మీడియా మీద వేసేస్తున్న వైనం చూస్తే నేతల టాలెంట్ ఎంత‌న్న‌ది అర్థం కావ‌ట‌మే కాదు.. మీడియాను బ‌లిప‌శువుగా చేయ‌టం నేత‌ల‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

తాను అన‌ని మాట‌ను అన్న‌ట్లుగా చెప్పి మీడియా త‌న‌పై బుర‌ద‌జ‌ల్లుతోంద‌ని ఆరోపిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి. ఈ రోజు నుంచి విశాఖ‌లో జ‌ర‌గ‌నున్న తెలుగుదేశం మ‌హానాడు కార్య‌క్ర‌మానికి సంబంధించి గ‌తంలో మాట్లాడిన ఈ పెద్ద మ‌నిషి.. ల‌క్ష‌లాది మందికి చ‌దువుల ఇల్లైన ఆంధ్రా యూనివ‌ర్సిటీని దెయ్యాల కొంప‌గా అభివ‌ర్ణించి చాలా పే..ద్ద త‌ప్పే చేశారు. ఆయ‌న మాట‌లు విశాఖ వాసుల్నే కాదు.. ఆంధ్రా వ‌ర్సిటీతో అనుబంధం ఉన్న ప్ర‌తిఒక్క‌రి మ‌నోభావాల్ని ఘోరంగా దెబ్బ తీయ‌ట‌మే కాదు.. హ‌ర్ట్ అయ్యేలా చేసింది.

తాను నోరు జారిన మాట పెద్ద వివాదంగా మారింద‌న్న విష‌యాన్ని గుర్తించిన ఎంవీవీఎస్ మూర్తి.. తాను అలా ఎందుకుఅంటాన‌ని.. తాను సైతం ఆంధ్రా వ‌ర్సిటీలోనే చ‌దువుకున్న విష‌యాన్ని వెల్ల‌డించారు. మ‌రి.. చ‌దువుకున్న వ‌ర్సిటీని అంతేసి మాట ఎలా అంటార‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం రాని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే..తాజాగా ఈ టీడీపీ ఎమ్మెల్సీ కాస్త చిత్ర‌మైన వాద‌న‌ను వినిపించారు. మ‌హానాడు వేదిక వ‌ద్ద మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. దెయ్యాల‌కొంప వ్యాఖ్య‌లు తాను చేయ‌లేద‌ని.. అవ‌న్నీ మీడియా పుణ్య‌మేన‌ని.. వారు కావాల‌నే త‌న మీద బుర‌ద జ‌ల్లుతున్న‌ట్లుగా ఫైర్ అయ్యారు. "ఇదంతా మీరే చేశారు. ప్ర‌తిదాన్ని భూత‌ద్దంలో చూడ‌టం అల‌వాటైంది. ఏమీ లేక‌పోయినా ప్ర‌తిప‌క్షం కావాల‌నే రాద్ధాంతం చేస్తోంది. మీడియాతో పాటు ఒక పార్టీ కావాల‌నే రాద్ధాంతం చేస్తోందే కానీ.. నా త‌ప్పేం లేదు. నేనేం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌లేదు. కేవ‌లం మ‌హానాడును జ‌ర‌గ‌కుండా ఉండ‌టానికే ఇలాంటి కుట్ర‌లు ప‌న్నుతున్నారు" అంటూ విరుచుకుప‌డ్డారు. అనాల్సిన‌వ‌న్నీ అనేసి.. త‌ర్వాత మీడియా మీద ప‌డ‌టం ఈ మ‌ధ్య‌న నేత‌ల‌కు ఒక అల‌వాటుగా మారింది. అందుకు దెయ్యాల కొంప అంటూ మాట జారిన తెలుగు త‌మ్ముడి ఉదంత‌మే నిద‌ర్శ‌నం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/