Begin typing your search above and press return to search.
జగన్ పార్టీలోకి కాటసాని.. ముహుర్తం ఫిక్స్!
By: Tupaki Desk | 26 April 2018 5:57 AM GMTఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా పలువురు నేతలు గెలుపు అవకాశాలున్న పార్టీ మీద దృష్టి పెడుతుంటారు. సరిగ్గా ఎన్నికల సమయంలో పార్టీ మారితే జరిగే నష్టం నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తగా కాస్త ముందేపార్టీ కండువా మార్చేసుకుంటారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పలువురు నేతలు క్యూ కడుతున్నారు.
అయితే.. పార్టీలో చేరేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్న నేతల విషయంలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తొందరపడి పచ్చ జెండా ఊపేయటం లేదు. దీంతో పలు పార్టీలకు చెందిన నేతలు పార్టీలోకి చేరుతామంటూ సంకేతాలు.. రాయబారాలు పంపుతున్నా జగన్ పెద్దగా రియాక్ట్ కావటం లేదు.
అదే సమయంలో జనాదరణ ఉన్న నేతల విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించి.. ఒకసారి ట్రాక్ రికార్డును చెక్ చేసుకొని ఓకే అంటున్నారు.
కర్నూలు జిల్లాలో సీనియర్ నాయకుడు.. వరుస విజయాలు సాధించిన ట్రాక్ ఉన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తెగ ప్రయత్నాలు చేశారు. పార్టీ మారటానికి ముందు తనను అభిమానించే నేతలు.. కార్యకర్తలు.. అభిమానులతో భేటీ అయిన ఆయన తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇందుకు ఈ నెల 29న ముహుర్తంగా నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.
పాణ్యం నియోజకవర్గ నేతలు.. కార్యకర్తలతో నాలుగైదు రోజులుగా సమావేశాలు నిర్వహించిన తాను బీజేపీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు.
తన నియోజకవర్గ ప్రజల మనోభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న కర్నూలు జిల్లా పాణ్యం నుంచి 300 వాహనాల్లో జగన్ పాదయాత్ర వద్దకు బయలుదేరనున్నట్లు కాటసాని వెల్లడించారు.
తాను పాణ్యం టికెట్ ఆశించటం లేదని.. పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తానని.. పార్టీ ఆదేశాలకు తగ్గట్లు పని చేస్తానని ఆయన వెల్లడించారు. మొత్తంగా భారీ ఎత్తున కార్యకర్తలతో కలిసి జగన్ పార్టీలో చేరనున్న కాటసాని వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.