Begin typing your search above and press return to search.

ఈమె కడుపున జీసస్ జన్మించబోతున్నారట!

By:  Tupaki Desk   |   4 Nov 2016 3:23 PM GMT
ఈమె కడుపున జీసస్ జన్మించబోతున్నారట!
X
"అద్భుతం జరిగేముందు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరంలేదు.. సరికదా ఆ అద్భుతంముందు అంతా మోకరిళ్లుతారు" అని చెబుతుంది అమెరికాకు చెందిన 19ఏళ్ల యువతి. తెలుగు సినిమా డైలాగును మించి ఉన్న ఈ మాటలో ఆ అద్భుతం ఏమిటంటే... త్వరలో జీసస్ ఆ యువతి కడుపున జన్మించబోతున్నారట. మరో విషయం ఏమిటంటే... ఆమె ఇప్పుడు అవివాహిత కూడా! జెరుసలేంలోని యేసుక్రీస్తు సమాధిపై చలువరాతిని తెరిచినప్పటి నుంచి జీసస్ పై ఇలాంటి వింతవింత వార్తలు ఏదో ఒకమూలనుంచి ఇలా వెలుగులోకి వస్తున్నాయి.

నా కడుపున జీసస్ కు జన్మించిన తర్వాత, ఆ లోకరక్షకుడి ముందు అందరూ మోకాళ్లువంచి నమస్కరిస్తారు అని హాలే అనే అవివాహ యువతి చెబుతున్న ఈ విషయం అసలెలా బయటికొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం! ప్రస్తుతం తెలుగు టీవీ ఛానల్స్ లో ప్రసారం అవుతోన్న "ఫ్యామిలీ పంచాయితీ"ల తరహాలోనే అమెరికాలో "డాక్టర్ ఫిల్ షో" కార్యక్రమం చాలా ఫేమస్. ఈ కార్యక్రమంలో అతిధులుగా హాజరవ్వాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. అదేమిటంటే... సదరు వ్యక్తులు మానసిక వ్యాధిగ్రస్తులై ఉండాలి. ఇలా వింత వింత మానసిక వ్యాధుల బారినపడ్డవాళ్లు, వారి కుటుంబ సభ్యులు చెప్పే ఆసక్తికరమైన విషయాలను ఆ షోలో చూపిస్తారు. ఈ క్రమంలో తాజాగా హాలే అనే యువతి, ఆమె తల్లి క్రిస్టీతో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాలే... తాను జీసస్ కు జన్మనివ్వబోతున్నట్లు చెప్పింది!

అయితే... హాలే చాలాకాలంగా "కంపల్సీవ్ డిజార్డర్"అనే మానసిక వ్యాధితో బాధపడుతోందని, ఉన్నవి లేనట్లు, లేని వున్నట్లు ఊహించుకుంటుందని ఆమె తల్లి చెబుతున్నారు. మరో విషయం ఏమిటంటే... ఇప్పుడు గర్భవతిని అని చెప్పుకుంటున్న ఆమె గర్భదారణ కూడా భ్రమేనట! అయితే... చివరగా "హాలే సుదీర్ఘకాలం చికిత్స తీసుకుంటే తప్ప ఈ మానసిక వ్యాధి నయం కాదు" అని తేల్చి చెప్పారు షో హోస్ట్ డాక్టర్ ఫిల్! అదన్నమాట అసలు విషయం..!!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/