Begin typing your search above and press return to search.

వైరల్: జగన్ కు 8 ఏళ్ల చిన్నారి లేఖ.. ఏముందంటే?

By:  Tupaki Desk   |   14 Sep 2019 6:49 AM GMT
వైరల్: జగన్ కు 8 ఏళ్ల చిన్నారి లేఖ.. ఏముందంటే?
X
ఎనిమిదేళ్ల చిన్నారి ఒకరు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. తన తాతను.. తండ్రిని చంపేస్తామని బెదిరిస్తున్నారని.. వారిని కాపాడి తనకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. సంచలంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

ఎనిమిదేళ్ల చిన్నారి ఒకరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాసింది. తమ కుటుంబాన్ని ఊరి నుంచి వెలి వేశారని.. తనను స్కూల్ లోకి కూడా అనుమతించటం లేదంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ లేఖ బయటకొచ్చి సంచలనంగా మారి.. ప్రతి ఒక్కరి చేత అయ్యో అన్న ఆవేదనను కలిగేలా చేస్తోంది. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రపురానికి చెందిన ఈ చిన్నారి తన పేరును పుష్పగా పేర్కొంది.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రాసిన లేఖలో ఆమె.. ‘అన్నా.. నా పేరు కోడూరి పుష్ప. నాకోచెల్లెలు. పేరు గాయత్రి. ఒక తమ్ముడు.. పేరు హేమంత్. మా అమ్మనాన్నల పేర్లు కోడూరి రాజు, జానకీ, మా తాత నానమ్మల పేర్లు కోడూరి వెంకటేశ్వర్లు, మంగమ్మ. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రపురం గ్రామంలో మేము ఉంటున్నాము.

ఈ నెల నాలుగో తేదీ నుంచి మా స్కూల్లో మాతో పాటు చదువుకుంటున్న పిల్లలు ఎవరూ మా ముగ్గురితో మాట్లాడట్లేదు. ఎవరైనా మాతో మాట్లాడితే రూ. 10వేలు జరిమానా విధిస్తారని చెబుతున్నారు. మమ్మల్ని ఊర్లో వెలివేశారంట. ఇప్పుడు ఎవరూ మాతో మాట్లాడట్లేదు. మాతో ఆడట్లేదు. మాకు చదువుకోవాలని ఉంది. మాకు ఆడుకోవాలని ఉంది.

మా నాన్నను.. తాతను చంపేస్తారని మా స్నేహితులు చెబుతున్నారు.. మాకు చాలా భయంగా ఉందంటూ చిన్నారి పుష్ప.. తాను రాసిన లేఖను సీఎంకు పంపింది. సదరు లేఖలో తన తండ్రి ఫోన్ నెంబరు.. వివరాల్ని పేర్కొంది. ఇంతకూ అలా ఎలా జరిగిందన్న విషయాన్ని ఆరా తీస్తే.. పుష్ప తండ్రికి స్థానికులతో ఏదో వివాదం ుందని.. ఈ వ్యవహారంలో గ్రామ పెద్ద ఊరి నుంచి వెలివేసినట్లుగా చెబుతున్నారు. చిన్నారి లేఖకు సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.