Begin typing your search above and press return to search.
ఆయనకు అంత లేదు.. మా నాన్నే సీఎం
By: Tupaki Desk | 21 March 2019 9:31 AM GMTతమిళనాట సినిమా వారు రాజకీయాలు చేయడం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. ఎంతో మంది స్టార్స్ కోలీవుడ్ నుండి తమిళ రాజకీయాల వైపు నడిచారు. ప్రస్తుతం కూడా కమల్ హాసన్ మరియు రజినీకాంత్ లు పొలిటికల్ జర్నీకి సిద్దం అయ్యారు. ఇలాంటి సమయంలో తమిళ మరోసారి హీరో అయిన అజిత్ ను కూడా రాజకీయాల్లోకి రావాల్సిందిగా చాలా మంది అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ దర్శకుడు సుశీంద్రన్ తాజాగా సోషల్ మీడియాలో అజిత్ రాజకీయాల్లోకి రావాలి అంటూ డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
గత 40 ఏళ్లుగా తమిళనాడు రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది. ఆ అనిశ్చితి తొలగాలి అంటే ఖచ్చితంగా అజిత్ రాజకీయాల్లోకి రావాల్సిందే అంటూ డిమాండ్ ను సుశీంద్రన్ వ్యక్తం చేశాడు. సుశీంద్రన్ పోస్ట్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఈ సమయంలో తమిళ ప్రముఖ హీరో శింబు సోదరుడు కురలరాసన్ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా వివాదాస్పద పోస్ట్ పడింది. సుశీంద్రన్ పోస్ట్ కు కామెంట్ గా చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేంటి అంటే అజిత్ కు రాజకీయాల్లో అంత సీన్ లేదు, మా నాన్నే సీఎం అంటూ అందులో ఉంది.
కురలరాసన్ తమ అభిమాన హీరోను అవమాన పర్చే విధంగా కామెంట్ చేశాడు అంటూ అజిత్ అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం అజిత్ కు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదు. అయినా కూడా ఆయన్ను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని కురలరాసన్ ను ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. తన కొడుకుపై వస్తున్న విమర్శలకు రాజేందర్ స్పందించాడు. సోషల్ మీడియాలో ఎవరో తన కొడుకు పేరు పెట్టుకుని చేసిన పోస్ట్ కు మమ్ములను విమర్శించడం ఏమాత్రం సబబు కాదని, అసలు ఆ పోస్ట్ కు తన కొడుకుకు సంబంధం లేదు అన్నట్లుగా రాజేందర్ పేర్కొన్నాడు. అయినా కూడా అజిత్ అభిమానులు మాత్రం వదిలి పెట్టడం లేదు.