Begin typing your search above and press return to search.
తాను ఉగ్రవాదిని కాదంటున్న ఖాన్!
By: Tupaki Desk | 29 Sep 2016 4:35 AM GMTవాట్సప్ లో షేర్ అయిన ఒక ఫోటో ఒక కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేసింది, గందగగోళంలోకి నెట్టేసింది. వాట్సప్ గ్రూపుల్లో తన ఫోటో చూసుకున్న ఒక వ్యక్తి ఇంట్లోనుంచి బయటకు రావడమే మానేశాడు. చుట్టుపక్కల వాళ్లు అపార్ట్ మెంట్ ఖాళీ చేయమని వేధిస్తున్నారు - స్థానిక గూండాలతో బెదిరిస్తున్నారు. అతని పేరు సయీద్ షేర్ అలీఖాన్. ఇటీవల ముంబయిలో అధికారులు విడుదల చేసిన టెర్రరిస్టుల ఫోటోలతో ఇతని కుటుంబం గందరగోళంలోకి నెట్టబడుతుంది!!
టెర్రరిస్టులు అంటూ ముంబై పోలీసులు విడుదల చేసిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్నాయి. ఈ ఫొటోల కారణంగా ఖాన్ కుటుంబం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ ఫోటోల్లో ఇబ్బంది ఎదుర్కొంటున్న వ్యక్తి పేరు సయీద్ షేర్ అలీఖాన్.. ఒక సాధారణ డ్రైవర్. ఇతడు విరార్ ప్రాంతంలో భార్య - నలుగురు పిల్లలతో ఉంటున్నాడు. సెప్టెంబర్ 22న ఖాన్ బయటకు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అతని ఫొటో తీసి టెర్రరిస్టు అంటూ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆ మెసేజ్ చూసిన సయీద్ ఖాన్ బంధువులు - స్నేహితులు నిజంగానే ఉగ్రవాదులతో నీకు సంబంధాలు ఉన్నాయా అంటూ తెగ ఫోన్లు చేస్తున్నారట.
దీంతో ఆ వాట్సప్ పోస్టులు చుట్టుపక్కల వారికి - వీదిలో వారికీ కూడా చేరడంతో... బయటికెళ్తే ఎవరైనా దాడి చేస్తారేమో అనే భయాందోళనలకు గురైన ఆ కుటుంబం నాలుగైదురోజులు ఇంట్లో నుంచి బయటకే రావడం లేదట. ఇక ఇలా ఎంత కాలం ఉంటామని ఆలోచించిన ఖాన్.. ఒక ఫ్లకార్డు పట్టుకుని - భార్యా పిల్లలతో కలిసి ఒక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. ఆ ఫ్లకార్డుపై "నా పేరు సయీద్ షేర్ అలీఖాన్ - నేను ఉగ్రవాదిని కాను" అని రాశాడు. తాము ఉంటున్న అపార్ట్ మెంట్ ను ఖాళీ చేయమని కొంతమంది స్థానిక గూండాలు వేధిస్తున్నారని.. పెంచిన అద్దె రూ.2వేలు తాను కట్టడం లేదని తనను బెదిరిస్తున్నారని.. అందుకే తాను బయటికి వెళ్లినప్పుడు వారే ఎవరో ఈ ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఉంటారని ఆరోపిస్తూ అనుమానితుల పేర్లు పోలీసులకు తెలిపిన ఖాన్... తన పిల్లల ముందు తనకు ఇలాంటి పరిస్థితిని కల్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/