Begin typing your search above and press return to search.

నాన్ లోకల్ అనేసరికి మాట మారుస్తున్న షర్మిల.. ఓట్లు పడుతాయా?

By:  Tupaki Desk   |   1 Dec 2022 10:02 AM GMT
నాన్ లోకల్ అనేసరికి మాట మారుస్తున్న షర్మిల.. ఓట్లు పడుతాయా?
X
ఇన్నాళ్లు తెలంగాణలో పాదయాత్ర చేస్తూ ఎవరినీ తిట్టినా పట్టించుకోలేదు. కానీ హైదరాబాద్ లో ఒక్క ఆందోళనతో నేషనల్ మీడియాలో కూడా వచ్చేలా హైప్ తెచ్చుకుంది షర్మిల. నిన్న చేసిన ఆందోళనలు, అరెస్ట్ లతో కావాల్సినంత మైలేజ్ తెచ్చుకుంది.

ఇన్నాళ్లు పట్టించుకోని మీడియా వాళ్లు ఇప్పుడు షర్మిలకు బాగానే ప్రయారిటీ ఇస్తున్నారు. రాజకీయవర్గాలు తిట్టుడు షురూ చేశాయి. టీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేస్తోంది. కానీ జనం షర్మిలను ఏ కోణంలో చూస్తున్నారని అర్థం కావడం లేదు.

ఇక తమపై విమర్శలతో బయటకొచ్చింది గులాబీ దండు. వైఎస్ షర్మిల ఎవరినైతే బలం అనుకుంటుందో దాని మీదే కొట్టింది. రాజన్న రాజ్యం, వైఎస్ఆర్ పాలన తెస్తానంటున్న షర్మిలపై అదే వైఎస్ఆర్ తెలంగాణకు ఎంత ద్రోహం చేసింది విమర్శిస్తూ షర్మిలను డిఫెన్స్ లో పడేసే రాజకీయాన్ని టీఆర్ఎస్ చేస్తోంది. తెలంగాణను అడుగడుగునా అడ్డుకొని.. రాకుండా కుట్ర పన్నిన వైఎస్ఆర్ ను, నాడు ఆంధ్ర ఉద్యమం చేసిన షర్మిలను టీఆర్ఎస్ ఏకిపారేస్తోంది.

దీంతో తాజాగా గవర్నర్ తమిళిసైను కలిసిన షర్మిల తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేశారు. 'ఆంధ్రావాళ్లని మాట్లాడుతున్నారు. కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా? ఆయన భార్యను గౌరవించనప్పుడు నన్ను కూడా గౌరవించాలి. నేను ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడే పెళ్లి చేసుకున్నాను. ఇక్కడే బిడ్డకు జన్మనిచ్చాను. నా గతం ఇక్కడే.. భవిష్యత్తు ఇక్కడే' అని అన్నారు. దీంతో టీఆర్ఎస్ తనను ఆంధ్రా అని విమర్శిస్తున్న మాటలకు కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తూ ఇంతయాగీ చేస్తున్నా జనాలు మాత్రం పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఇదంతా డ్రామాలాగానే చూస్తున్నారు జనం. షర్మిల ఏం చేసినా.. మాట్లాడినా తెలంగాణలో నాటకీయత తప్పితే సహజంగా అనిపించడం లేదన్న వాదన జనంలో ఉంది. గతంలో జగన్ సైతం ఇలానే చేశాడు. ఆయనకు సంస్థాగతంగా పార్టీ బలం ఉంది కాబట్టి అక్కడ గెలిచాడు. షర్మిలకు ఇక్కడ వెంట నడిచే నేతలు.. పార్టీ బలం ఏమాత్రం లేదు.

మరి షర్మిల ఇంతలా యాగీ చేయడానికి వెనుక కేసీఆర్ ఉన్నారా? బీజేపీ ఉందా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే అందరిలోనూ అనుమానాల మేఘాలు ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.