Begin typing your search above and press return to search.

హిందువా? అని అడిగి మరీ కాల్చేశారు

By:  Tupaki Desk   |   23 Jan 2016 5:01 AM GMT
హిందువా? అని అడిగి మరీ కాల్చేశారు
X
కొన్ని కొన్ని ఘటనలకు విపరీతమైన ప్రచారం లభిస్తుంది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎప్పుడూ..ఏ అంశం మీదా స్పందించని నేతలు సైతం వ్యాఖ్యలు చేస్తుంటారు. సదరు అంశాన్ని తమ భుజాల మీదకు ఎత్తుకొని తిరుగుతుంటారు. అదేసమయంలో.. మరికొన్ని ఘటనల మీద ఎవరూ పట్టించుకోవటం కనిపించదు. మహారాష్ట్రలోని పూణె లో చోటు చేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

ఒక కుర్రాడి మతం అడిగి.. అతను హిందువు అని చెప్పాక అతనిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. బాధితుడి తండ్రి చెబుతున్న కథనం ప్రకారం.. సావన్ రాథోడ్ ఫుణెలో చెత్త ఏరుకొని జీవనం సాగిస్తుంటాడు. 17 ఏళ్ల ఈ కుర్రాడు జనవరి 13న తీవ్ర గాయాలతో పుణె ఆసుపత్రిలో చేరాడు. ఆ కుర్రాడు 15న మరణించాడు. తీవ్ర గాయాలు ఎలా తగిలాయన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ముగ్గురు కుర్రాళ్లు తన దగ్గరకు వచ్చారని.. ఏం చేస్తున్నావని.. పేరేంటని ప్రశ్నించారని.. తన పేరు సావన్ రాథోడ్ అని చెప్పినట్లుగా వెల్లడించాడు.

నువ్వు హిందువువా అని అడిగారని.. తాను అవునని చెప్పిన తర్వాత వాళ్లు తన మీద పెట్రోల్ పోసి కాల్చేశారని ఆ కుర్రాడు స్పష్టం చేశారు. హిందువుని తెలిసిన తర్వాతే కాల్చేశారా? అని ప్రశ్నిస్తే అవునని ఆ కుర్రాడు వెల్లడించాడు. ఈ కేసుకు సంబంధించి ఇబ్రహీం షేక్.. జుబేర్ తండోలీ.. ఇమ్రాన్ తంబోలీ అనే యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదంతంపై నిందితుల వాదన మరోలా ఉంది. ఆ కుర్రాడు కారు బ్యాటరీలు దొంగలించాడని అనుమానించామని.. అందుకే పెట్రోల్ పోసి తగలబెట్టేశామని పోలీసులకు చెప్పినట్లుగా చెబుతున్నారు. ఎంత బ్యాటరీలు దొంగతనం చేస్తే మాత్రం పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారా?