Begin typing your search above and press return to search.
ఆలస్యంగానైనా మేల్కొన్న ఫేస్ బుక్..మయన్మార్ మిలటరీ అకౌంట్ తొలగింపు..!
By: Tupaki Desk | 21 Feb 2021 11:30 PM GMTమయన్మార్‌లో గత కొంతకాలంగా సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రజా పాలనను రద్దుచేసి.. ఆ దేశాన్ని మిలటరీ తన ఆధీనంలోకి తీసుకున్నది. ఈ నిర్ణయాన్ని దేశప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రోడ్లమీదకు వచ్చి తమ నిరసనను తెలుపుతున్నారు. అయితే సైన్యం మాత్రం ప్రజలమీద దాడులు చేస్తున్నది. ప్రశ్నిస్తున్న జనాలను కాల్చిచంపుతున్నది. మయన్మార్ సైన్యం నిర్ణయాలను అంతర్జాతీయ సమాజం సైతం తీవ్రంగా ఖండిస్తున్నది.
అయినప్పటికీ ప్రజలు భారీగానే బయటకు వస్తున్నారు. దీంతో ఆ దేశ సైనికాధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లయింగ్ ఓ వింత నిర్ణయం తీసుకున్నాడు. ప్రజలను, ఉద్యమకారులను, ఆందోళనకారులను అదుపులోకి తీసుకొచ్చేందుకు పాత నేరస్థులను జైళ్ల నుంచి విడిపించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది.
ఈ నేపథ్యంలో ఆర్మీకి ఫేస్‌బుక్ షాక్ ఇచ్చింది.
మయన్మార్ లోని మాండలే నగరంలో శనివారం పౌర నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఆ దేశ మిలిటరీకి సంబంధించిన అధికారిక పేజీని ఫేస్‌బుక్ తొలగించింది. తమ సంస్థ నిబంధనలను మిలిటరీ పదేపదే ఉల్లంఘిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్‌బుక్ ప్రకటించింది.మయన్మార్‌లో ఆన్‌లైన్ వేదికగా మిలిటరీ విద్వేష ప్రచారాలు చేస్తుంది. ఈ ప్రచారాలు నివారించడంలో ఫేస్‌బుక్ విఫలమైందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎట్టకేలకు ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకున్నది.
ఇదిలా ఉంటే తాజాగా మయన్మార్ సైన్యం పై ఫేస్‌బుక్ చర్యలు తీసుకున్నది. సైన్యం అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌ను సంస్థ తొలగించింది. ప్రస్తుతం ఆ దేశంలో పౌరులకు స్వేచ్ఛ లేదు. ప్రజలకు ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలను కట్‌చేశారు. ఎవరైనా నిరసన తెలిపితే కాల్చి చంపేయాలని సైన్యానికి ఆదేశాలు అందాయి.