Begin typing your search above and press return to search.

120 మందిని సముద్రం పాల్జేసిన విమానం

By:  Tupaki Desk   |   8 Jun 2017 6:28 AM GMT
120 మందిని సముద్రం పాల్జేసిన విమానం
X
గత కొన్నేళ్లుగా భారీ విమాన ప్రమాదాలు ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పట్లో మలేషియా విమానం ఒకటి ఎక్కడ కూలిపోయిందో కూడా తెలియకపోవడం సస్పెన్సుగా మారింది. తాజాగా మన పొరుగుదేశం మయన్మార్ కు చెందిన విమానమొకటి అండమాన్‌ సముద్రంలో విమానం కూలిపోయింది. అందులో ఉన్న 120 మంది జలసమాధి అయ్యారు.

అయితే... ఎకరైనా సజీవంగా ఉండే కాపాడేందుకు నౌకలు - యుద్ద విమానాలు ఇప్పటికే సముద్ర ఉపరితలంపై గాలింపు చర్యలు వేగవంతం చేశాయి. ఇందులో సైనికులు - వారి కుటుంబాలకు చెందిన 106 మంది... మరో 14 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దావెయి నగరానికి సరిగ్గా 218 కిలోమీటర్ల దూరంలోని అండమాన్‌ సముద్రంలో విమాన శకలాలు కనిపించాయి.

విమానం కనిపించకుండా పోయిన సమయంలో 18 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోందని.. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదని అధికారులు చెప్తున్నారు. నాలుగు ఇంజిన్లు గల ఈ వై-8ఎఫ్‌-200 అనే విమానం చైనా మోడల్‌లోనే తయారు చేశారు. ఇది కార్గో విమానం. కాగా విమాన ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న వారి మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విమానం కూలిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న నౌకలకు ఓ వ్యక్తి - మహిళ - చిన్నారి మృతదేహంతో పాటు లగేజీ బ్యాగ్ లు - సేఫ్టీ జాకెట్లు - విమానం టైరు నీటిపై తేలియాడుతూ కనిపించాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/